ఈ మధ్యకాలంలో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు టీవీ షోలు చాలా పుట్టుకొస్తున్నాయి. ఏ పండగ వచ్చినా స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంటాయి టీవీ ఛానల్స్. ఇక రానున్న హోలీ ఫెస్టివల్ సందర్భంగా అన్ని టీవీ ఛానల్స్ స్పెషల్ ఈవెంట్స్ కి సంబంధించి ప్రోమోలు రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ఈటీవీ యాజమాన్యం హోలీ స్పెషల్ ‘అంగరంగ వైభవంగా’ ఈవెంట్ ప్రోమో వదిలింది.
ఈ ప్రోమోలో ఈటీవీ సీరియల్స్ లో కనిపించే నటీనటులు, సీనియర్ సినీ నటులు అందరూ వేడుకలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. అయితే.. ఈ కార్యక్రమంలో సీనియర్ హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవిత కూడా పాల్గొన్నారు. ఇక ఎలాగో జీవిత, రోజా ఇద్దరూ రచ్చబండ, బతుకు జట్కా బండి లాంటి రియాలిటీ షోలలో హోస్ట్ లుగా వ్యవహరించారు. కాబట్టి రోజా, జీవితలతో బతుకు జట్కా బండి స్కిట్ ప్లాన్ చేసింది యాజమాన్యం.
ఇక స్కిట్ లో రోజా బాధితురాలుగా ఒకవైపు కూర్చోగా.. రాజశేఖర్, హైపర్ ఆది, నరేష్, భాస్కర్ మరోవైపు కూర్చున్నారు. జీవిత హోస్ట్ గా వ్యవహరించింది. స్కిట్ లో భాగంగా రోజా మాట్లాడుతూ.. ‘వీళ్లు మాట్లాడే మాటలకు నాకు నరాలు లాగేస్తాయి’ అంది. వెంటనే హోస్ట్ జీవిత స్పందించి.. ‘ఏ యాంగిల్ లో అమ్మా!’ అంటూ కౌంటర్ వేసింది. అది విని షోలో అంతా పగలబడి నవ్వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.