అమ్మాయిలు తమ కురులు పొడవుగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. అందుకోసం ఎన్నో చిట్కాలు, హెయిర్ స్టైలింగ్ పద్ధతులను పాటిస్తారు. ఈ క్రమంలో తమ కురులను అందంగా, ఆరోగ్యంగా మల్చుకోవాలని సెలూన్ల వైపు పరిగెడుతుంటారు. ఇప్పుడు ఇదంతా మనకెందుకు అంటారా.. దేశంలోనే అత్యంత పాపులర్ హెయిర్ స్టైలిస్ట్ అయిన జావెద్ హబీబ్ ఓ మహిళ హెయిర్ కట్ చేస్తూ నీటికి బదులు ఉమ్మి వాడడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో జరిగింది. జావెద్ హబీబ్ కొంతమందితో కలిసి ట్రైనింగ్ సెమినార్ నిర్వహించారు. ఇందులో ఓ మహిళను హెయిర్ కట్ కోసం సెలూన్ కుర్చీ వద్దకు పిలిచాడు. ఆ మహిళ జుట్టును దువ్వెనతో సరిచేస్తూ..సెమినార్‌కు హాజరైన వారికి హెయిర్ కేర్ టిప్స్ చెప్తున్నాడు ఇంతలోనే ఒకవేళ నీళ్లు లేకపోతే ఉమ్మితోనే జట్టును శుభ్రం చేసుకోవాలి’ అంటూ మహిళ తలపై ఉమ్మి వేసేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
#BoycottJavedHabib . He is spitting in the head of woman and laughing shamelessly. pic.twitter.com/05mixPeoTV
— I Am Modi (@Kapilkaushik) January 5, 2022
కాగా తనకు జరిగిన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుని వాపోయింది బాధితురాలు. జావేద్ హబీబ్ సార్ సెమినార్‌కు వెళ్లాను. హెయిర్ కట్ చేయడానికి నన్ను స్టేజి మీదకు పిలిచారు. ఆయన నా హెయిర్ కట్ చేస్తూనే నీరు లేకపోతే ఉమ్మితోనే హెయిర్ కట్ చేయాలంటూ నాతో తప్పుగా ప్రవర్తించారు ఇది నాకు ఏ మాత్రం నచ్చలేదు. అంటూ ఆ మహిళ తన బాదను చెప్పుకుంది. ఈ ఘటనపై విమర్శలు పెరగడంతో క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనపై మీ అభిఫ్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.