సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఎవరు? ఎందుకు? వైరల్ అవుతున్నారో? ఎవరు, ఎందుకు, సెలబ్రిటీలు అవుతున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి. అలా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు అయ్యేందుకు ఎంతకైనా తెగిచ్చేస్తున్నారు. ఆ క్రేజ్ అనే చట్రంలో పడిపోయి.. ఫేమస్ అయ్యేందుకు రీల్స్, వీడియోలు అంటూ నానా హంగామా చేస్తున్నారు. అయితే ఆ క్రమంలో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. కొందరైతే ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి ఎన్ని ఘటనలు చూసినా కూడా చాలా మందిలో మార్పు రావడం లేదు. పాపులారిటీ కోసం పాకులాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలా రీల్స్ మోజులో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
రీల్స్ చేసేందుకు ఓ ఇంటర్ విద్యార్థి హన్మకొండ జిల్లా కాజీపేట సమీపంలోని వడ్డేపల్లి రైల్ గేటు వద్దకు వెళ్లాడు. అక్కడ తాను వేగంగా వస్తున్న రైలు ముందు నడుస్తూ ఉన్నాడు. రైలుకు బాగా దగ్గరగా నిల్చోవడంతో ట్రైన్ ఢీకొట్టింది. ఒక్కసారిగా విద్యార్థి పక్కకు గిరాటేసినట్లు కంకర రాళ్లలో పడ్డాడు. కాళ్లకు, తలకు బాగా గాయాలయ్యాయి. అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడిని పరిశీలించిన తర్వాత.. 24 గంటలు గడిస్తేగానీ ఏం చెప్పలేమని చెప్పారు. అతను ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అక్షయ్‌గా గుర్తించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
హన్మకొండ: యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిన ఇన్‌స్టా రీల్స్ క్రేజ్.. ఖాజీపేట్‌లో రైలు పక్కన ఫీట్ చేసిన వడ్డేపల్లికి చెందిన యువకుడు.. రైలు వేగం ధాటికి ఒక్క ఉదుటున కిందపడటంతో తప్పిన ప్రాణముప్పు pic.twitter.com/D7GQqVi5FL
— NTV Breaking News (@NTVJustIn) September 4, 2022