ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా వానలు వీపరితంగా కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారింది. మనతో పాటు అడవిలోని వన్య మృగాలు సైతం తమ ప్రాణాలు కాపాడుకునేందు కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే మీరు పులి.. పులి మధ్య పోరటం చూసుంటారు.. అలాగే పులి మనిషి మధ్య పోరాటం చూసుంటారు. కానీ పులి తన ప్రాణాల కోసం పోరాడడం ఎప్పుడైనా చూశారా?. ఇదిగో ఇప్పుడు చూడండి. ఓ పులి తన ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మరింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపుర్ఖేరీ ప్రాంతంలో ఓ పులి బ్యారేజ్‌నీటిలో తన ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. కర్తానియాఘాట్ టైగర్ రిజర్వ్ దగ్గర వరద ధాటికి ఓ పులి రిజర్వాయర్ లోకి కొట్టుకు వచ్చింది. గిరిజపురి బ్యారేజీ వద్ద ఘగ్రా నది ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో ఆ పులి బ్యారేజ్ గేట్ల వరకు కొట్టుకొచ్చింది. అది చాలా సేపు నీటికి ఎదురు ఈదుతూనే ఉంది.
#Tiger caught in heavy currents in Sharda river in Katarniaghat.#UttarPradesh https://t.co/V2dTBPDzVh pic.twitter.com/te9vOxHoSM
— Arvind Chauhan अरविंद चौहान (@Arv_Ind_Chauhan) July 22, 2022
మీదకు ఎక్కే ప్రయత్నం చేసిన వరద ధాటికి నీటిలో మునిగిపోయింది. దీంతో, సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు స్థానికుల సాయంతో పులిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణాల కోసం అంతలా పోరాడిన పులి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The team lead by @aakashbadhawan monitored the safe passage to tiger and other wildlife during high flood times in Katerniaghat. Monsoon in Terai is a tough time for protection and patrolling.
AV: UPFD pic.twitter.com/6gb9LZavEh— Ramesh Pandey (@rameshpandeyifs) July 22, 2022
ఇదీ చదవండి: Justice NV Ramana: సోషల్ మీడియాపై సీజేఐ ఎన్వీ రమణ సీరియస్ కామెంట్స్!
ఇదీ చదవండి: అందమైన అమ్మాయిల పేరుతో అర్థరాత్రి మెసెజ్! సీన్ కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్!