ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే మగ పెళ్లివారకి కట్నకానుకలు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వం వరకట్నాన్ని నిషేధించినా.. కట్నం అనేమాటను ఉపయోగించకుండా ఏదో ఒక రూపంలో కానుకల సమర్పనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక అత్తమామలకు ఎంత డబ్బున్నా.. అల్లుడికి కట్నంగా కారో, బంగ్లానో ఇస్తారు. కానీ మన కథలో అత్తమామలు ఏకంగా రైలు కొనిచ్చారు. మరి వారి ప్రేమకు పొంగిపోయిన అల్లుడు ఏం చేశాడు.
చెప్పే వాళ్లకు.. వినేవాళ్లు లోకువ అంటే ఇదే అనుకోవచ్చు. ఓ వ్యక్తి.. తన పెళ్లి కట్నం గురించి చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందులో ఓ వ్యక్తి ఏమంటున్నాడంటే.. తన అత్తమామలు తనకు పెళ్లిలో కట్నంగా రైలు ఇచ్చారట. కానీ తాను దాన్ని తీసుకోలేదు అని చెప్తున్నాడు. ఎందుకు అని మరో వ్యక్తి అడిగితే.. ‘అంత పెద్ద రైలును ఎక్కడ పెట్టుకోవాలి. నాకు అసలే పార్కింగ్ ప్లేస్ కూడా లేదు’ అన్నాడు. 30 సెకండ్ల వీడియోలో అతను చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి.
🤣🤣🤣🤣🤕🤕🤣😭😭 pic.twitter.com/a1RaPIUhUp
— Professor ngl राजा बाबू 🥳🌈 (@GaurangBhardwa1) April 11, 2021
అతను చెప్పేది వింటున్న వ్యక్తి.. ‘నిజమా?’ అని అడిగితే.. ‘అవును.. నాకు రైలు నడపడం రాదు.. అందుకే వద్దన్నానని’ చెప్తున్నాడు. అవతలి వ్యక్తి.. “రైలు ఇంజిన్ కూడా ఇచ్చారా?” అని అడిగితే.. అన్నీ ఇచ్చారు. రైలుతో పాటూ.. అన్నీ ఇచ్చారు” అని చెప్తున్నాడు. ఈ సంఘటన ఎక్కడ చోటుచేసుకుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, పాత వీడియో అయినప్పటికీ మళ్లీ వార్తల్లో నిలిచింది. మరికొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు. “అబద్ధం కూడా ఎంతో కాన్ఫిడెంట్‌తో చెబుతున్నాడు. అలా ఉండాలి” అంటున్నారు.
😭😭😭🤣🤣🤣
एवरीवन राइट नाउ : pic.twitter.com/XsIhIWJmN7— BABA RANCHO (@Baba_rancho_) April 11, 2021