ఇండియాలోని పాపులర్ ల్యాప్‌టాప్ తయారీ సంస్థలలో ఒకటైన HP.. తాజాగా గేమింగ్ ల్యాప్‌టాప్ లలో HP Omen 16ని లాంచ్ చేసింది. ల్యాప్‌టాప్ మార్కెట్స్ లోనే ఇది కంపెనీ పోర్ట్‌ఫోలియోను మరింత మెరుగుపరచనుందట. అలాగే ఈ ల్యాప్ టాప్.. కొత్త గేమింగ్ నోట్‌బుక్ ఇంటెల్ 11వ జెనరేషన్ ప్రాసెసర్స్ తో రన్ అవుతోందట. 16 అంగుళాల సైజు కలిగిన డిస్‌ప్లేతో ఈ ల్యాప్‌టాప్ ను 11వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, NVIDIA GeForce RTX 30 సిరీస్ లతో రూపొందించారు. ఇందులో 1080p, 60fps వద్ద గేమ్స్ ప్లే చేయగలదు. HP లాంచ్ చేసినటువంటి ఈ లేటెస్ట్ ల్యాప్ టాప్ గురించి మరో విశేషం ఏంటంటే.. దీని పార్ట్స్ అన్ని రీసైకిల్ చేసిన అల్యూమినియం స్టాంప్డ్ కవర్‌తో పాటు పోస్ట్ – కన్స్యూమర్ రీసైకిల్డ్ ఓషన్-బౌండ్ ప్లాస్టిక్ తో తయారు చేశారు.
ఈ HP లేటెస్ట్ ల్యాప్ టాప్ లో బెస్ట్ స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే.. HP Omen 16 సిరీస్ ల్యాప్ టాప్స్ మోడరన్ – 16:9 యాస్పెక్ట్ రేషియోతో.. 16.1 అంగుళాల క్వాడ్ HD డిస్‌ప్లే రిజల్యూషన్ (165Hz రిఫ్రెష్ రేట్) డిస్‌ప్లేతో అందుబాటులోకి రానున్నాయి. ఈ ల్యాప్ టాప్ 3ms రెస్పాన్స్ కలిగి 100% sRGB కలర్ కవర్ చేయనుందట. అదనపు డిస్‌ప్లే ఫీచర్లలో ఐ-సేఫ్ ఫ్లికర్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఇది HPకి మాత్రమే ఉన్న సొంత ఫీచర్ తో TUV రైన్‌ల్యాండ్ ఆక్సిప్టెన్సిటీ కలిగి ఉంటుంది.
గేమింగ్ ల్యాప్ టాప్ విషయానికి వస్తే..
ఇందులో ఎక్కువ మంది గేమర్స్ ఆకర్షించే ఫీచర్స్ ఉన్నాయి. HP Omen 16 సిరీస్ గేమింగ్ ల్యాప్ టాప్స్ మాక్సిమం 11వ జనరేషన్ Intel Core i7-11800 ప్రాసెసర్లను అందిస్తాయి. ఈ ల్యాప్ టాప్స్ 8GB VRAM వరకు Nvidia GeForce RTX 3070 GPU కలిగి ఉంటాయి. దీని స్టోరేజ్ఈ.. మాక్సిమం 16GB DDR4 3200MHz RAMని అందిస్తాయట. SSD స్టోరేజ్ కోసం ఏకైక PCIe Gen4 x4 స్లాట్ కలిగి ఉంటుంది. ఈ రకం ల్యాప్ టాప్ లతో కస్టమర్స్ మాక్సిమం 1TB SSDని పొందే అవకాశం ఉంది.
HP Omen 16 సిరీస్ గేమింగ్ ల్యాప్ టాప్ యొక్క అదనపు ఫీచర్స్ లో ఒమెన్ టెంపెస్ట్ కూలింగ్ అని లేటెస్ట్ ఫ్యాన్ బ్లేడ్స్ కలిగి ఉంటుంది. అయితే దీని ముందు లాంచ్ అయిన లాప్ టాప్స్ కంటే రెండున్నర రెట్లు సన్నగా(స్మార్ట్) ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇది Omen 15 వెర్షన్ కంటే 3 రెట్లు ఫ్యాన్ బ్లేడ్స్ క్రియేట్ చేయడంలో తోడ్పడనుంది. ల్యాప్ టాప్ బ్యాటరీ బ్యాకప్ 9 గంటల వరకు రన్ చేయగల 83Whrని కలిగి ఉంటుంది. అంతేకాకుండా కీబోర్డ్ యాంటీ-ఘోస్టింగ్ సపోర్ట్ తో 4-జోన్ RGB LED లైటింగ్ రానుందని కంపెనీ వివరించింది.
ఈ లేటెస్ట్ HP Omen 16 సిరీస్ గేమింగ్ నోట్‌బుక్స్ ఇండియాలో రూ.1,39,999 నుండి ప్రారంభం కానున్నాయి. ల్యాప్ టాప్ కొనుగోలు చేయడానికి HP ఆన్‌లైన్ స్టోర్‌లతో పాటు ఇతర ఆన్‌లైన్ స్టోర్స్ నుండి కొనుగోలు చేసుకోవచ్చు. దీన్ని ఆఫ్‌లైన్‌లో కొనాలని అనుకుంటే HP ఆఫీసియల్ స్టోర్స్ లేదా ఇతర మల్టీ -బ్రాండ్ రిటైల్ స్టోర్‌లను సందర్శించవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ లేటెస్ట్ వెర్షన్ గేమింగ్ ల్యాప్ టాప్స్ డిసెంబర్ 7, 2021.. అంటే ఈరోజు నుండే మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు కంపెనీ ప్రకటించింది.