తెలుగు రాష్ట్రాల్లో భీమ్లానాయక్ ఫీవర్ నడుస్తోంది. పవన్ కెరీర్లో మొదటి రూ.వంద కోట్ల సినిమా కావడం మరో విశేషం. ఈ సినిమా హిందీ వర్షన్ ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మార్చి చివరి వారంలో ఆహాలోకి కూడా భీమ్లానాయక్ ఎంటర్ అవుతోందని తెలుస్తోంది. ఆ సినిమాకు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆ సినిమాలో చిత్ర పాడిన అంత ఇష్టం సాంగ్ యూట్యూబ్ సెన్సేషన్ అయిన విషయం తెలిసిందే. సాంగ్ సినిమాలో లేకపోయినప్పటికీ ఇంకా ఆ పాట క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఎక్కడ చూసినా ఆ పాట వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు జ్యోతి అనే హౌస్ కీపింగ్ మహిళ ఆ పాటను పాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతో అద్భుతంగా ఆమె అంత ఇష్టం సాంగ్ పాడటాన్ని తమన్ కూడా మెచ్చుకున్నారు. ‘ప్రేమతో ఎంత ఇష్టంగా పాడారు.. మా అంత ఇష్టం సాంగ్’ అంటూ ట్వీట్ చేశారు. మీరు ఓ సారి ఆ పాట వినేసేయండి. జ్యోతి ఎలా పాడిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Prematho 💕 entha ISTHAM ga padaaruu maaaaa #AnthaIshtam song ▶️ https://t.co/1L6WKYFzH5
— thaman S (@MusicThaman) March 6, 2022