పెళ్ళి అనేది నలుగురిలో జరగాలి, ఆ తర్వాత జరిగే లొల్లి నాలుగు గోడల మధ్య జరగాలి అని పెద్దలు ఊరికే అనలేదు. ముద్దైనా, ముచ్చటైనా పడక గదిలో తీర్చుకుంటేనే బాగుంటుంది. అందరి ముందూ తీర్చుకుంటే ఇదిగో ఇలానే సోషల్ మీడియాలో విమర్శలకు గురవుతారు.
ఆ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలు కూడా పెళ్ళికి అంగీకరించారు. ఘనంగా పెళ్ళి ఏర్పాట్లు చేసి బంధువులు, మిత్రుల సమక్షంలో అంగరంగవైభవంగా వివాహం జరిపించారు. ఆఖరున పురోహితుడు వధూవరులను ఒకరినొకరు ముద్దు పెట్టుకోండి అంటూ సెలవిచ్చాడు.
ఇక వరుడు దొరికిందే సందని చెలరేగిపోయాడు. వధువుని దగ్గరకు తీసుకుని.. వదలకుండా చాలా సేపు ముద్దాడాడు. ఎంతసేపటికి వదలకపోవడంతో ‘ఇదెక్కడి మాస్ రా మావా’ అంటూ అక్కడున్న జనం ముక్కున వేలేసుకున్నారు. ఉత్సాహవంతులైన యువకులు ఈ వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“మామూలుగా సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకుపోతారు మగాళ్లు. అందునా నచ్చిన అమ్మాయిని, అందులోనూ భార్యని.. ముద్దు పెట్టుకోమంటే గ్యాప్ ఎక్కడిస్తారు. అసలే కరువు బ్యాచ్” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ వరుడి రియాక్షన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. చివరికి విషాదం ఏంటంటే?
ఇది కూడా చదవండి: Yash: ‘డాడీ బ్యాడ్ బాయ్’ అంటున్న యశ్ తనయుడు.. వీడియో వైరల్