పెళ్లంటే మామిడి తోరణాలు, వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, బంధువుల పలకరింపులు అంతా మాములు హడావుడి ఉండదు. పెళ్లి కొడుకు భారీ ఊరేగింపుతో మండపానికి వస్తాడు. అదే ఉత్తరాదిన అయితే.. గుర్రం ఎక్కి దర్జాగా పెళ్లి మండపానికి వస్తాడు. కానీ, పెళ్లికొచ్చిన వారంతా అవాక్కయ్యేలా ఓ పెళ్లికొడుకు మాత్రం వాటన్నింటికి భిన్నంగా అంబులెన్సులో మండపానికి వచ్చాడు.
రాజస్థాన్ లోని ఓ పెళ్లిలో మండపం వద్దకు అంబులెన్సు వచ్చి ఆగింది. అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. వెళ్లి చూడగా అందులో టిప్పుటాపుగా ముస్తాబయ్యి.. కళ్లద్దాలు పెట్టుకుని కిలకిలా నవ్వుతూ వరుడు కనిపించాడు. ఇలా ఎందుకు వచ్చాడా అని అందరూ చూస్తుండిపోయారు. అమ్మాయి తరపు వాళ్లు వెళ్లి వరుడుని స్ట్రెచర్ పై మండపానికి తీసుకొచ్చి వధువు పక్కన కూర్చోబెట్టారు.
విషయం ఏంటంటే గత నెలలో వారికి పెళ్లి కుదిరింది. కానీ, వారం క్రితం వరుడుకి ప్రమాదంలో కాలు విరిగింది. రాడ్డు కూడా వేశారు. ఆ విషయం తెలిసినా వధువు పెళ్లికి నో చెప్పలేదు. అతడినే వివాహం చేసుకుంటా అని చెప్పింది. దాంతో ఆమె నిర్ణయం విన్న స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఆ వరుడు జామ్ జామ్ అంటూ వివాహం చేసుకున్నాడు. ఈ ఆదర్శ వధువుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.