Viral Video: మనుషులు, జంతువులకు మధ్య ఉన్న సంబంధం ఈనాటిది కాదు. వేల సంవత్సరాల నుంచి జంతువులు మనుషులకు ఓ అవసరంగా, తోడుగా ఉంటూనే ఉన్నాయి. కొంతమంది ఓ పనిలా పెంపుడు జంతువుల్ని పెంచి అమ్ముతుంటారు. అలాంటి వాటిలో మేకలు, గొర్రెలు, కోళ్లు లాంటి జంతువులు ముఖ్యమైనవి. అవి తమను అమ్మటానికి పెంచుతున్నారన్న సంగతి తెలియక యజమానులపై ఎంతో ప్రేమను పెంచుకుంటాయి. వారు కొట్టినా, తిట్టినా పడుంటాయి. తిండి పెడితే సంతోషిస్తాయి. లేదంటే బాధతో అరుస్తాయి.. తప్ప తిరగబడవు.
కానీ, మనుషులు వాటిని అమ్మేసి సొమ్ము చేసుకుంటారు. తాజాగా, ఓ యజమాని ఓ మేకను పెంచి పెద్ద చేసి, బేరానికి పెట్టాడు. మార్కెట్‌లో పెట్టి అమ్మేశాడు. అప్పుడు ఆ మేక నన్ను అమ్మొద్దంటూ మనిషిలా గుక్క పెట్టి ఏడ్చింది. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి బక్రీద్ సందర్భంగా తన మేకను అమ్మటానికి మార్కెట్‌కు తీసుకెళ్లాడు. ఆ మేకను బేరానికి పెట్టాడు. ఆ మేక బలిష్టంగా ఉండటంతో ఓ వ్యక్తి దాన్ని పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు.
మేకను అతడు తీసుకుపోయేటప్పుడు అసలు కథ మొదలైంది. ఆ మేక తనను కొనుక్కున్న వ్యక్తితో వెళ్లటానికి ఇష్టపడలేదు. తన యజమాని దగ్గరకు వెళ్లి అతడ్ని హత్తుకుంది. నన్ను అమ్మొద్దంటూ అచ్చం మనిషిలా గుక్క పెట్టి ఏడ్చింది. యజమాని కూడా దాన్ని పట్టుకుని బాధపడ్డాడు. ఏడ్చొద్దంటూ ఓదార్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Video: జవాన్ కి ఆ చిన్నారి చేసిన పని చూస్తే సెల్యూట్ కొట్టకుండా ఉండలేరు..