ఈ మధ్యకాలంలో యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో రీల్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. చాలా మంది రీల్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఏదైన ప్రదేశం నచ్చితే చాలు.. అక్కడ తప్పకుండా రీల్ చేయాల్సిందే అన్నట్లు వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. మరికొందరు తాము ఎక్కడ ఉన్న సంగతి మరచి మరి..రీల్స్ చేస్తుంటారు. ఇవి కొన్ని సందర్భాల్లో సమస్యలను సృష్టిస్తాయి. తాజాగా ఓ యువతి మెట్రో స్టేషన్‌లోకి స్నేహితులతో కలిసి వచ్చింది. ఈ క్రమంలో ఆ యువతి ప్లాట్‌ఫామ్‌పై ఓ సాంగ్‌కు డ్యాన్స్ చేసి దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. అసలే అందమైన అమ్మాయి, పైగా మోడ్రన్ దుస్తుల్లో రెచ్చిపోయి డ్యాన్స్ చేయడంతో ఆమె టాలెంట్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియో మెట్రో అధికారులకు చేరడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ లోని ఓ మెట్రో రైల్వేస్టేషన్ కి ఓ అమ్మాయి.. తన స్నేహితులతో కలిసి వచ్చింది. ఆ యువతికి మెట్రోస్టేషన్ బాగా నచ్చినట్లుంది. దీంతో రీల్స్ చేయాలి అనుకుంది. వెంటనే స్నేహితుల చేతికి ఫోన్ ఇచ్చి ఫ్లాట్ ఫామ్ పై.. “రా..రా..” అనే సాంగ్ కు డ్యాన్స్ చేసింది. అంతటి తో ఆగక మెట్రో ట్రైన్ లోపల కూడా మరో సాంగ్ కి డ్యాన్స్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలు చూసిన నెటిజన్లు.. ఆ యువతి డ్యాన్స్ కి ఫిదా అయిపోతున్నారు. చాలా బాగా డ్యాన్స్ చేసిందంటూ కొందరు కామెంట్స్ చేయగా, పబ్లిక్ ప్లేస్ లో ఇలా బిహేవ్ చేయడం మంచికాదని మరికొందరు కామెంట్స్ చేశారు. కానీ మెట్రో స్టేషన్ లో యువతి చిందులు వేయడంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. త్వరలోనే యువతిపై చర్యలు తీసుకుంటామని హెచ్ఎంఆర్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.