పెళ్లి అంటే నూరేళ్ళ పంట అంటారు. కానీ.., మగవారికి పెళ్లి అంటే ఒక పండగ. మధురమైన ఘట్టం. కానీ.., స్త్రీ విషయంలో ఇలా చెప్పలేము. ఆమెకి కూడా పెళ్లి అనేది జీవితంలో ఒక కీలక ఘట్టమే కావచ్చు. కానీ.., మూడు ముళ్ళు మేడలో పడ్డాక, ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది. అమ్మ, నాన్నని తోబుట్టువులను, అయిన వారిని, సొంత ఇంటిని వదిలేసి ఆమె వేరొక ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ అత్తగారి ఇల్లే ఇక తన ఇల్లు. ఈసమయంలో స్త్రీ మనసు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అందులో కాస్త భయం కూడా ఉంటుంది. అత్త ఇంటివారు తనని ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్నది ఆమె భయం. కానీ.., కొత్త కోడలిని సకల మర్యాదలతో, బహుమానాలతో ముంచెత్తుతూ మెట్టినిళ్లు ఆహ్వానిస్తే.. ఆ స్త్రీకి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
సాధారణంగా కొత్త కోడలు మొదటిసారి ఇంట్లోకి అడుగుపెట్టే ముందు అత్తింటివారు చేసే మర్యాదలు అన్నీ ఇన్నీ కాదు.. గేటు దగ్గర నుంచే మేళతాళాలతో నవ వధూవరులను సాధరంగా ఆహ్వానిస్తారు. తాజాగా అత్తవారింటిలో అడుగుపెట్టబోతున్న ఓ కొత్త కోడలికి అదిరిపోయే గిఫ్ట్స్ ఇస్తూ స్వాగతం పలికారు ఓ అత్తింటివాళ్లు. ఆ నవ వధువుకు గుర్తుండిపోయే రీతిలో మెట్టుమెట్టుకు.. ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. వెండి సామాగ్రి నుంచి నోట్ల నోట్ల కట్టల వరకు గిఫ్ట్స్ ఇచ్చి పెళ్లికూతురును ఫిదా చేశారు. ఇవన్నీ చూసిన ఆ పెళ్లికూతురుకు నోటమాట రాలేదు. ఒక్కసారిగా ఆనందంతో భావోద్వేగానికి గురైంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో.., అంతా ఆ కోడలు అదృష్టవంతురాలు అని కామెంట్స్ చేసేస్తున్నారు.