Viral Video: ఈ సృష్టిలో చాలా వింతలు, విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వింత, విచిత్ర సంఘటనల్లో.. వర్షంతో పాటు కప్పలు, చేపలు, నాణేలు ఇలా ఏదో ఒకటి పడటం మనకు తెలిసిన సంగతే. వర్షంతో పాటు చేపలు పడితే చేపల వర్షం అని, కప్పలు పడితే కప్పల వర్షం అని అంటూ ఉంటారు. ప్రపంచంలో చాలా చోట్ల ఇలాంటి వర్షాలు కురిశాయి. తాజాగా, బిహార్‌లో ఓ చోట చేపల వర్షం కురిసింది. అయితే, ఆ చేపల వర్షం ఇంకాస్త విచిత్రమైనది. ఏందుకంటే ఆ వర్షం ఆకాశంలోంచి కురవలేదు. ట్రక్కులోంచి కురిసింది. ట్రక్కులోంచి కురవటం ఏంటి? అనుకుంటున్నారా? ఏం లేదు.. కొద్దిరోజుల క్రితం బిహార్, గయా జిల్లాలోని ఆమస్ థానా పోలీస్ స్టేషన్‌లో పరిథిలో మేయిన్ రోడ్డుపై ఓ చేపల ట్రక్కు వెళుతోంది. ఓ చోట ఉన్నట్టుండి ట్రక్కు అదుపు తప్పింది.
ఈ నేపథ్యంలో అందులోని చేపలు ట్రక్కునుంచి భారీ సంఖ్యలో నడి రోడ్డుపై పడిపోయాయి. ఇది గమనించిన అక్కడి జనం చేపల కోసం ఎగబడ్డారు. బకెట్లు, చీర కొంగులు, ప్లాస్టిక్ కవర్లు ఇలా అన్నింటిలో చేపల్ని నింపుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ పండగ చేసుకోండి.. చేపల కూరతో..’’ .. ‘‘ ఇలా కూడా చేపల వర్షం కురుస్తుందా?’’.. ‘‘ జనాలు మామూలు స్పీడుగా లేరు. క్షణాల్లో చేపల్ని ఖాళీ చేశారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
सड़क पर गिरी मछली, मच गई लूट#बिहार pic.twitter.com/ZleUZpDOp2
— Hari krishan (@ihari_krishan) May 28, 2022
ఇవి కూడా చదవండి : Suryapeta: శివాలయంలో కొట్టుకున్న పూజారులు.. కారణం తెలిసి నవ్వుకుంటున్న జనాలు!