ఆమె తన ఎడమ చేతిపై పచ్చ బొట్టు వేయించుకున్న తర్వాత దాన్ని ఫొటో తీసి తండ్రికి పంపింది. ఆ ఫొటో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోపై స్పందిస్తున్న నెటిజన్లు..
కొన్ని వేల ఏళ్ల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ట్యాటూల సంస్కృతి ఉంది. గతంలో ట్యాటూ కేవలం సంప్రదాయ విషయానికి సంబంధించినదిగా ఉండేది. తర్వాతి కాలంలో అది జ్ఞాపకాలకు కూడా సంబంధించిన విషయంగా మారిపోయింది. నూటికి తొంభై శాతం మంది తమ జీవితంలోని అద్భుతమైన విషయాలను, తమ జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల పేర్లను శరీరంపై ముద్రించుకుంటున్నారు. అయితే, చాలా మంది తల్లిదండ్రులకు పిల్లలు ట్యాటూలు వేయించుకోవటం అస్సలు నచ్చదు.
తెలియకుండా పచ్చ బొట్లు వేయించుకున్న వారిని తల్లిదండ్రులు కొట్టడం, తిట్టడం పరిపాటి. అయితే, వయసు పెరిగిన వ్యక్తులను కొట్టడం కుదరదు. అందుకే తిట్టడం మాత్రమే జరుగుతుంది. తాజాగా, ఓ తండ్రి.. ట్యాటూ వేయించుకున్న కూతురిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. ఆమె పెట్టిన ఫొటోకు చంపుతా అంటూ రిప్లై ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం శరణ్య అనే యువతి తన ఎడమ చేతిపై 05-02-1978 అని పచ్చ పొడిపించుకుంది. అది తండ్రి పుట్టిన రోజుకు సంబంధించింది. ఆమె పచ్చ పొడిపించుకున్న తర్వాత దాన్ని ఫొటో తీసింది. ఆ ఫొటోను తన తండ్రికి వాట్సాప్ చేసింది.
ఆ ఫొటోను చూడగానే ఆయన ఫైర్ అయ్యాడు. ‘నేను నిన్ను చంపుతా’ అంటూ మెసేజ్ పెట్టాడు. తండ్రి పెట్టిన మెసేజ్‌ను శరణ్య స్క్రీన్ షాట్ తీసింది. తర్వాత దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ‘మా నాన్న నా ట్యాటూను అంగీకరించారు’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
My dad approves of the tattoo clearly pic.twitter.com/8uJrYWq5X1
— sharanya;) (@sharandirona) May 10, 2023