తల్లి మనకి జన్మనిస్తే… తండ్రి ఆ జన్మకి మూల కారణం. మనమంటూ జీవం పోసుకున్నామంటే.. అది తల్లిదండ్రులిద్దరి చలవే. అయితే మనలో చాలామంది తల్లి చాటు బిడ్డలనేది సత్యం. కానీ, తల్లితో సరిసమానమైన ప్రేమను.. తండ్రి కూడా మనకు అందిస్తాడనడంలో సందేహం లేదు. తల్లి ప్రేమ భావోద్వేగాలతో ముడిపడి ఉంటే.. తండ్రి ప్రేమ బాధ్యతతో ముడిపడి ఉంటుంది. అది మనుషులకైనా, జంతువులకైనా. మనుషుల్లాగే జంతువులకూ తమ పిల్లలపై అమితమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను అవి తమ హావభావాలతో వ్యక్తం చేస్తుంటాయి. ఇదిగో.. ఈ వీడియో చూడండి. అప్పుడే పుట్టిన బిడ్డను మొదటిసారి చూసిన తండ్రి జిరాఫీ ఎంతలా ఎమోషనలయ్యిందో. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
వీడియోలో చూస్తున్న తండ్రి జిరాఫీ పేరు మైఖేల్. అప్పుడే పుట్టిన బిడ్డ పేరు ట్విగా. ఈ వీడియోను యూఎస్‌లోని కాలిఫోర్నియా బార్బరా జూలో షూట్ చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డను చూసేందుకు తండ్రి జిరాఫీని జూ సిబ్బంది లోపలకి అనుమతించారు. లోపలికి వచ్చిన మైఖేల్.. ఎంక్లోజర్‌లో తల కిందికి వంచి తన బిడ్డను చూసుకుంటోంది. బిడ్డ అటూఇటూ పరుగెత్తుతుంటే చూసి ఆనందిస్తోంది. అనంతరం తల పైకెత్తి తల్లి జిరాఫీకి ముద్దుపెడుతుంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 1.4 మిలియన్ల మంది వీక్షించారు. 49వేల లైక్స్ వచ్చాయి. ఈ వీడియో చూసిన వారందరూ ‘హృదయాన్ని హత్తుకునే దృశ్యమంటూ’ కామెంట్ చేస్తున్నారు. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Father giraffe came to visit his newborn son🦒🦒🦒 pic.twitter.com/byh5lzARvd
— Tansu YEĞEN (@TansuYegen) May 24, 2022
ఇది కూడా చదవండి: Video: సెకండ్ హ్యాండ్ సైకిల్ కొన్న తండ్రి. సంతోషంతో మురిసిపోయిన కొడుకు! ఈ వీడియో సోషల్ మీడియాని ఊపేస్తోంది!