సాధారణంగా ఎదుగుతున్న కూతుర్ల విషయంలో తల్లిదండ్రులు ఎంత కేర్ తీసుకుంటారో చెప్పే అవసరం లేదు. ముఖ్యంగా తండ్రి తీసుకునే జాగ్రత్తలు ఎంతో ముచ్చటగా ఉంటాయి. కూతురి కోసం ఎంత కష్టాన్నైనా భరించేందుకు సిద్ధపడతారు. అయితే.. తండ్రి ఎలాగో భరించేందుకు సిద్ధంగా ఉన్నాడు కదా.. అని ఓ కూతురు చేసిన నిర్వాకం చూస్తే నవ్వుకుండా ఉండలేరు.
కూతురు స్కూటీ నేర్చుకుంటా అనగానే.. తండ్రి కాదనలేక ‘నేర్పిస్తా పదమ్మా’ అంటూ కూతురి చేతికి స్కూటీ తాళం ఇచ్చాడు. నేర్చుకుంటుంది కదా.. అని స్కూటీని స్టాండ్ పై నిలిపి.. ఎలా డ్రైవ్ చేయాలో కూతురికి వివరించాడు. అలా చెప్పి ముందుకు వెళ్ళాడో లేదో ఇంతలోనే సదరు కూతురు తండ్రికి పట్టపగలే చుక్కలు చూపించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. కూతురికి దగ్గరుండి స్కూటీ డ్రైవింగ్ నేర్పించాలని భావించిన తండ్రి.. స్కూటీ ఎలా మూవ్ చేయాలో చెప్పి కూతురు ముందుకు వెళ్లి నిలబడి చెబుతున్నాడు. ఇంతలో కూతురు స్టాండ్ వేసి ఉన్న స్కూటీని మెల్లగా మూవ్ చేయబోయి.. ఒక్కసారిగా స్పీడ్ కంట్రోల్ తప్పి తండ్రి మీదకే దూసుకెళ్లి గుద్దేసింది. దెబ్బకి ఇద్దరూ కిందపడ్డారు. స్కూటీ నేర్పించాలనుకున్న తండ్రికి ఆ విధంగా ఝలక్ ఇచ్చింది కూతురు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు. కానీ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. మరి ఈ ఫన్నీ వీడియో పై మీ అభిప్రాయలను కామెంట్స్ లో తెలియజేయండి.