సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వింతలు, విశేషాలు మన కళ్ల మందు ప్రత్యక్షం అవుతున్నాయి. వాటిలో కొన్ని వైరల్ వీడియోలు కడుపుబ్బా నవ్వులు పూయిస్తుంటే.. కొన్ని కన్నీరు పెట్టించే విధంగా ఉంటున్నాయి.. మరికొన్ని ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటున్నాయి. ఇక వివాహ వేడుకలకు సంబంధించిన కొన్ని కామెడీ వీడియోలు తెగ నవ్వులు పూయిస్తున్నాయి. వధూవరుల డ్యాన్స్ వీడియోలు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి.
వివాహ వేడుకుల సమయంలో కొంత మంది వీడియోలు తీసి అవి సోసల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారతున్నాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెళ్లి నిశ్చయం అయిన తర్వాత ఇరువురి బంధువులు తమ పిల్లలకు నిశ్చితార్ధం వేడుక గ్రాండ్ గా జరిపిస్తుంటారు. ఆ సమయంలో ఒకరికొకరు రింగులు మార్చుకోవడం తెలిసిందే. ఒక ఎంగేజ్ మెంట్ ఈ తతంగం పూర్తయిన తర్వాత ఒక కామెడీ సీన్ జరిగింది. అబ్బాయికి అమ్మాయి రింగు తొడిగి కాళ్లు మొక్కింది.
ఇక అబ్బాయి రింగ్ తొడిగి వెంటనే అమ్మాయిని ఫాలో అయ్యాడు.. అంటే ఆమె తన కాళ్లకు దండం పెట్టడంతో తాను కూడా అమ్మాయి కాళ్లకు దండం పెట్టాడు. దాంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారే షాక్ అయ్యారు. తర్వాత పగలబడి నవ్వుకున్నారు. పక్కనే ఉన్న ఒక పెద్ద మనిషి అబ్బాయిని పైకి లాగాడు. అలా అమ్మాయి కాళ్లు నువ్వు మొక్కకూడదురా బాబూ అని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ నవ్వులు పూయిస్తుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.