మనుషుల మాదిరిగానే పక్షలు సైతం తమ ఎమోషన్స్ ను ప్రదర్శిస్తుంటాయి. ఇలాంటి ఘటనలు మనం నిత్యం చాలానే చూస్తుంటాం. ఈ పశుపక్ష్యాదులు తమ తోటి వాటి కోసం, యజమానుల కోసం విశ్వాసం, పోరాటం, ఆప్యాయతలను ప్రదర్శించడం జరుగుతుంది. అయితే మృతి చెందిన తన నేస్తాన్ని పూడ్చడానికి వెళ్తుంటే.. ఆ బాధను తట్టుకోలేక ఓ పక్షి దానివెంట కడదాక వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పక్షి చేసిన పని నెటిజన్ల హృదయాన్ని కలచివేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్తాన్ లోని కుచేర ప్రాంతంలో రామస్వరూప్ బిష్ణోయ్ అనే వ్యక్తి ఇంటి వద్ద నాలుగేళ్లుగా రెండు నెమలు ఉంటున్నాయి. బిష్ణోయ్ ఎక్కడి నుంచో వచ్చిన వాటికి రోజూ ధాన్యం గింజలు వేస్తుంటాడు. అయితే ఓ రోజు అందులోని ఓ నెమలి మృతి చెందింది. దీంతో ఇద్దరు వ్యక్తులను పురమాయించి ఆ నెమలిని పూడ్చమని చెప్పాడు రామస్వరూప్. ఆ వ్యక్తులు నెమలి మృతదేహాన్ని పూడ్చడానికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో నెమలి.. చనిపోయిన తన సహచర నెమలిని విడిచి ఉండలేకపోయిందో ఏమో పాపం.. దాని వెంట కడదాక పరుగులు తీసింది. ఇందుకు సంబంధించిన వీడియోను పర్వీన్ కాస్వాం అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నెమలి వీడియో వీక్షించిన నెటిజనులు హార్ట్ టచింగ్ వీడియో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The peacock doesn’t want to leave the long time partner after his death. Touching video. Via WA. pic.twitter.com/ELnW3mozAb
— Parveen Kaswan (@ParveenKaswan) January 4, 2022