భారత దేశ వ్యాప్తంగా చాలా రకాల కోళ్లు పెంపకంలో ఉన్నాయి. బ్రాయిలర్ కోళ్లను పక్కన పెడితే.. నాటు కోళ్లు మొత్తం ఒకే విధంగా ఉంటాయి. సైజులో, ఆకారంలో కొద్ది పాటి తేడాలు ఉంటాయేమో కానీ, మొత్తం అంతా ఒకే విధంగా ఉంటాయి. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కోళ్లు మన ఊహలకు అందని విధంగా ఉంటాయి. వాటిని చూడగానే కొంత అసహ్యం కూడా కలిగే అవకాశం ఉంది. అవే డాంగ్ టావో జాతికి చెందిన కోళ్లు. ఈ డాంగ్ టావో జాతి కోళ్లు చాలా విచిత్రంగా ఉంటాయి. కాళ్లు బోధకాలు వచ్చిన మనిషి కాళ్లలా లావుగా ఉంటాయి. ముఖం, గొంతు కింద భాగం కూడా ఉబ్బి ఉంటుంది.
ఇవి కేవలం వియత్నాంలో మాత్రమే దొరుకుతాయి. ఈ కోళ్లు దాదాపు 4 కిలోల బరువు ఉంటాయి. వాటి కాళ్లే బరువులో ఐదు శాతం ఉంటాయి. ఈ కోళ్ల ధర మార్కెట్లో రెండు వేల డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే.. 8,660 రూపాయలు. ఇక, ఆ కోళ్ల కాళ్లు మాత్రమే 150 డాలర్ల ధర పలుకుతున్నాయి. సైజు పెరిగే కొద్ది వాటి ధరలో కూడా మార్పులు ఉంటాయి. పెద్ద కోళ్లు దాదాపు 10 కేజీల బరువు ఉంటాయి. వీటితో అందాల పోటీలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అందంగా ఉన్నాయని అనుకున్న కోళ్లను ఈ పోటీలకు పంపిస్తారు.
ఇవి ఎక్కువగా మొక్క జొన్నలు తింటాయి. వాటి కాళ్లు, చర్మానికి ఎంతో విలువ ఉంది. ముఖ్యంగా వాటి కాళ్లు ఎక్కువ రుచిగా ఉంటాయట. వీటి మాంసాన్ని సంవత్సరాంతంలో మిత్రులకు బహుమతిగా కూడా ఇస్తారు. చూడ్డానికి ఎంతో విచిత్రంగా ఉండే ఈ కోళ్లకు వియత్నాంలో చాలా పేరుంది. మాంసం ప్రియులు వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. అది కూడా ధనిక వర్గానికి చెందిన వాళ్లు వీటిని ఇష్టంగా కొని తింటూ ఉంటారు. మరి, ఈ వింత విచిత్రమైన వియత్నాం డాంగ్ టావో కోడి జాతిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Giant legs of Vietnam’s ‘dragon chicken’ a Lunar New Year delicacy.
📷 Nhac NGUYEN #AFP pic.twitter.com/prqegvpFLK— AFP Photo (@AFPphoto) January 17, 2023