ఆఫీస్‌లో కునుకు తీయటం అంటే కొంతమందికి చాలా ఇష్టం. అందుకే ఎవ్వరూ చూడ్డం లేదు అనుకుని కళ్లు మూసుకుని పాలు తాగుతున్న పిల్లిలా చేస్తూ ఉంటారు. కానీ, అలాంటి వారిపై అందరి దృష్టిపడకనే పడుతుంది.
నిద్ర అన్నది మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైనది. ఒకప్పుడు చీకటి పడంగానే భోజనం ముగించి జనం నిద్రపోయే వారు. తెల్లవారుజామునే నిద్ర లేచి పొలం పనులు చేసుకునేవారు. అయితే, టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత కొంతమంది రాత్రి 11, 12 గంటలు అయినా నిద్ర పోవటం లేదు. దీంతో నిద్రపోవాల్సిన సమయంలో కాకుండా పని చేసే చోట్ల నిద్రపోతున్నారు. ఇలా ఆఫీస్ టైంలో నిద్రపోయి చాలా మంది తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. తోటి ఉద్యోగుల మధ్య పరువు పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. తాజాగా, ఓ వ్యక్తి ఆఫీస్‌లో నిద్రపోయి తన జీవితంలో ఎప్పుటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని సంపాదించుకున్నాడు. తోటి ఉద్యోగులు చేసిన పనికి అతడి దిమ్మ తిరిగిపోయింది.
ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి ఆఫీస్‌లో నిద్రపోతూ ఉన్నాడు. ఇంతలో ఓ వ్యక్తి అందరికీ కొన్ని సూచనలు చేశాడు. దీంతో వారంతా అక్కడినుంచి పక్కకు వచ్చి దాపెట్టుకున్నారు. కొద్ది సేపటి తర్వాత నిద్ర లేచిన ఆ వ్యక్తి.. అక్కడ ఎవ్వరూ లేకపోవటం గుర్తించాడు. సీటులోంచి పైకి లేచి చుట్టూ చూశాడు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. తన మిత్రుడికి ఫోన్ చేశాడు. తాను సినిమా హాల్‌లో ఉన్నానని అతడు చెప్పాడు. అది ఆదివారం అని కూడా అన్నాడు. దీంతో నిద్ర మేల్కొన్న వ్యక్తి ఆశ్చర్యపోయాడు.
‘నేను శుక్రవారం నుంచి నిద్రపోతున్నానా’ అంటూ గట్టిగా కేక పెట్టాడు. అక్కడినుంచి పక్కకు వెళ్లాడు. అదే సమయంలో దాపెట్టుకున్న వారంతా తమ తమ సీట్లలోకి వచ్చి పని చేసుకోవటం మొదలుపెట్టారు. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి అక్కడికి వచ్చి వారిని చూశాడు. ఏమీ అర్థం కాని ముఖం పెట్టాడు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఇది ఫ్రాంక్ అంటే..’’ .. ‘‘ ఇది మనల్ని ఏప్రిల్ ఫూల్ చేయటానికి క్రియేట్ చేసిన వీడియోలా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Hilarious! pic.twitter.com/A1B2O7Nfuy
— FunnymanPage (@FunnymanPage) March 28, 2023