Doctors Dance : సంగీతంతో రాళ్లనైనా కరిగించవచ్చు.. అంటూ ఉంటారు. అలాంటి రాగంతో బెడ్‌కు పరిమితమై కదల్లేని స్థితిలో ఉన్న పేషంట్‌లో కదలికలు తీసుకురావచ్చు అనుకున్నారు కొంతమంది లేడీ డాక్టర్లు. అతడి ముందు ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన పాటలకు డ్యాన్స్‌లు వేశారు. అతడిలో కదలిక వచ్చింది. ఆ లేడీ డాక్టర్లు వారు అనుకున్నది సాధించటమే కాకుండా అందరి దృష్టిలో పడి అభినందనలు పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జోన్, గొల్లపల్లికి చెందిన శ్రీనివాస్ కాలేయ వ్యాధితో బాధపడుతూ మీనాక్షి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతడి మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి కదల్లేని స్థితికి చేరుకున్నాడు. రోజు రోజుకు అతడి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది.
ఈ నేపథ్యంలో అతడిలో కదలికలు తేవటానికి డాక్టర్లు ఓ కొత్త రకం పద్దతిని ఎంచుకున్నారు. అతడి ముందు సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తే కదలికలు వచ్చే అవకాశం ఉందని భావించారు. లేటెస్ట్ హిట్ సాంగ్.. ‘‘డీజే తిల్లు’’.. ‘‘డుగ్గు.. డుగ్గు’’ పాటలకు అతడి ముందు డ్యాన్స్‌లు వేశారు. అనుకున్నట్లుగానే అతడిలో కదలికలు మొదలయ్యాయి. కాళ్లు, చేతులు కదల్చటం మొదలుపెట్టాడు. దీంతో అతడ్ని ఐసీయూనుంచి జనరల్ వార్డుకు తరలించారు. ప్రస్తుతం వారు శ్రీనివాస్ ముందు డ్యాన్సులు వేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు వారు చేసిన పనికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వైరల్ వీడియో: మేక మెడలో తాళి కట్టిన యువకుడు..!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.