23 రోజుల పాటు పోరాడిన ఈ నెల 18న కన్ను మూశారు తారకరత్న. కుటుంబ సభ్యులు, వేలాది మంది అభిమానుల సమక్షంలో ఆయన అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. తారకతర్నకు తుది వీడ్కోలు పలికేందుకు సినీ పరిశ్రమ మొత్తం కదిలింది, బంధువులు కూడా పాల్గొన్నారు. ఆయన అంత్యక్రియల్లో తారక రత్న బాబాయ్, ప్రముఖ హీరో కూడా పాల్గొన్నారు.
నటుడు తారకరత్న మరణంతో నందమూరి-నారా కుటుంబంతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 27న కుప్పంలోని టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పం వెళ్లిన ఆయన.. ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ముందుగా సమీపంలోని ఆసుపత్రికి తరలించినా..అనంతరం మెరుగైన వైద్యం కోసం నారాయణ హృదయాలయకు తీసుకెళ్లారు. విదేశీ వైద్యులు వచ్చినా ఫలితం లేకుండా పోయింది. 23 రోజుల పాటు పోరాడిన ఆయన ఈ నెల 18న కన్ను మూశారు. కుటుంబ సభ్యులు, వేలాది మంది అభిమానుల సమక్షంలో ఆయన అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. తారకతర్నకు తుది వీడ్కోలు పలికేందుకు సినీ పరిశ్రమ మొత్తం కదిలింది. ఆయన స్నేహితులు, బంధువులు చివరి చూపు చూసేందుకు వచ్చారు.
మహా ప్రస్థానంలో నిర్వహించిన తారకరత్న అంత్యక్రియలకు ఆయన బాబాయ్, ఒకప్పటి స్టార్ హీరో కళ్యాణ్ చక్రవర్తి కూడా పాల్గొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు పెద్దకుమారుడే ఈ కళ్యాణ్ చక్రవర్తి. ఇప్పుడు ఆయన గుర్తు పట్టలేని విధంగా మారిపోయారు. కళ్యాణ్ చక్రవర్తి పలు సినిమాల్లో నటించారు. అత్తగారు స్వాగతం, అక్షింతలు, అత్తగారు జిందాబాద్, ఇంటిదొంగ, మామా కోడళ్ల సవాల్, కృష్ణ లీల, రౌడీ బాబాయ్ , దొంగ కాపురం, లంకేశ్వరుడు, తలంబ్రాలు, ప్రేమ కిరీటం, జీవన గంగ వంటి పలు సినిమాల్లో నటించారు.. కేవలం హీరోగానే కాకుండా.. కీలక పాత్రల్లోనూ కనిపించారు.కళ్యాణ్ చక్రవర్తి 1986 నుంచి 1994 వరకు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. 2003లో కబీర్ దాస్ అనే సినిమా తర్వాత పూర్తిగా చిత్ర పరిశ్రమ నుండి తప్పుకున్నారు.
కళ్యాణ్ చక్రవర్తి మాస్ హీరోగా ఎదగాలని ప్రయత్నించి.. ఆ తరహా సినిమాలు చేశారు కానీ అవి ఆయనకు వర్కౌట్ కాలేదు. మంచి పాత్రలు చేసినప్పటికీ.. కొన్నిసినిమాలు తప్ప.. మిగిలినవీ ఆయనకు పేరు తేలేదు. దీంతో కళ్యాణ్ చక్రవర్తి సినిమాలకు దూరమై.. ఇతర వ్యాపారాలు చూసుకుంటూ చెన్నైలోనే స్థిరపడ్డాడు. ఇప్పుడు చాలాకాలం తర్వాత తారకరత్న మరణంతో హైదరాబాద్‌కు వచ్చారు. తారకరత్న ఇంటి వద్ద కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ లను కళ్యాణ్ చక్రవర్తి పలకరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో ఎవ్వరూ గుర్తు పట్టలేని విధంగా మారిపోయారు ఆయన.