టెక్నాలజీ పెరిగిన తర్వాత మనిషి పని చాలా తేలిగ్గా అవ్వటం మొదలైంది. అసాధ్యం అనుకున్న పని కూడా సుసాధ్యం అవుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అద్భుతాలు ఆవిష్కృతం అవుతున్నాయి. అందులో భాగంగా పుట్టుకొచ్చిందె.. జెండర్ స్వైప్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా ఆడవాళ్లను మగాళ్లుగా.. మగాళ్లను ఆడవాళ్లుగా మార్చొర్చు. అంటే మనుషుల్ని కాదు.. వారి ముఖాలను మాత్రమే మార్చొర్చు. ఉదాహరణకు ఒక హీరో ఫొటోను జెండర్ స్వైప్ టెక్నాలజీతో స్త్రీగా మార్చొర్చు. ఈ టెక్నాజీని సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు తరచుగా ఉపయోగిస్తూ ఉంటారు. తాజాగా, కొంతమంది సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు భారత దేశానికి చెందిన కొంతమంది ప్రముఖ సెలెబ్రిటీల ఫొటోలను జెండర్ స్వైప్ చేశారు.
నరేంద్ర మోదీ, విరాట్ కొహ్లీ, ముఖేష్ అంబానీ, షారూఖ్ ఖాన్, దీపికా పదుకునే, అక్షయ్ కుమార్ తదితరుల ఫొటోలను జెండర్ స్వైప్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటొల్లో కొంతమంది గుర్తుపట్టే విధంగా ఉంటే.. మరికొంతమంది తల బద్దలు కొట్టినా గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. ఇంకా కొంతమంది ఏమాత్రం మారకపోవటం గమనార్హం. ఇక, ఈ ఫొటోలపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ కొహ్లీ నిజంగా గుర్తుపట్టలేనట్లుగా ఉన్నాడు. ఎవరైనా చూస్తే అమ్మాయేమో అనుకుంటారు’’.. ‘‘ వ్వావ్.. జెండర్ స్వైప్ టెక్నాలజీ నిజంగా ఓ అద్భుతం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, జెండర్ స్వైప్ టెక్నాలజీ ద్వారా సృష్టించిన ఈ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Gender is a spectrum
Reconstructed some Popular faces using ai.
First, Narendra Modi pic.twitter.com/CLEcswWmc0
— Madhav Kohli (@mvdhav) January 9, 2023