సమాజంలో ఎన్నో చర్చలు జరుగుతూ ఉంటాయి. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఇప్పుడు ఎక్కువగా చర్చలే జరుగుతున్నాయి. అయితే అవి ఎలాంటివి? వాటిని ఎవరు చేస్తున్నారు? వారికి నిజంగానే అంత వయసుందా? ఇలాంటి ఏవీ లేకుండా ఎవరు పడితే వాళ్లు ఎలా పడితే అలా చర్చలు చేస్తున్నారు. అలా మొదలైన ఒక చర్చ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సంప్రదాయం, ఆడవాళ్ల వస్త్రధారణ, స్వేచ్ఛ, సమానత్వం, అవకాశాల కల్పన ఇలా చాలా అంశాల్లో స్ర్రీ- పురుషుల మధ్య ఎన్నో చర్చలు జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా సందర్భాల్లో పలువురు మేధావులు ఇలాంటి సున్నితమైన అంశాలపై చర్చలు జరిపారు. వారి అభిప్రాయాలను బాహాటంగానే వెల్లడించారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిన తర్వాత యువత చాలా సందర్భాల్లో ఈ విషయాలపై లేనిపోని చర్చలకు తెర లేపుతున్నారు. ఇలాంటి అంశాలు.. ఎలా పడితే ఎక్కడ పడితే అలా చర్చించుకునే అంశాలు కానే కావు. వాటికి ఒక నిర్దిష్టమైన ప్లాట్ ఫామ్ కావాలి. నిపుణులు కావాలి. అలా కాకుండా కొందకు ఆకతాయిలు చేసిన ఒక పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా ఒక యువకుడు ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశాడు. “బాక్సర్లు వేసుకుని తెలుగు అమ్మాయిలు సెకండ్ షో సినిమాలకు వస్తున్నారు. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో? ఏమైనా అడిగితే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నిస్తారు” అంటూ ఒకరు ట్వీట్ చేశారు. అసలు రచ్చ అక్కడి నుంచి ప్రారంభం అయింది. అందరూ రెండు గ్రూపులుగా వడిపోయి ఒకళ్లు స్త్రీల వస్త్రధారణను సపోర్ట్ చేస్తూ, మరికొంత మంది వారి వస్త్రధారణను తప్పుబడుతూ చర్చ మొదలు పెట్టారు. ఇదంతా ట్విట్టర్ స్పేస్ లో షురూ చేశారు. అక్కడ ఎవరికి నచ్చింది వాళ్లు మాట్లాడటం, ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడటం చేశారు. అది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది.
ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. ఎవరైనా వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని ఎలాంటి అనుమానం లేకుండా వెల్లడించవచ్చు. అది బయటైనా, సోషల్ మీడియా అయినా పర్లేదు. కానీ, ఆ అభిప్రాయం ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసేలా, వేరే వాళ్లను కించ పరిచేలా ఉండకూడదు. ఇక్కడ యువత ఏం చేస్తున్నారంటే వారి సంప్రదాయాన్ని కాపాడుతున్నాం అనుకుంటూ ఇష్టారీతన మాట్లాడుతున్నారు. మరికొందరు ఆడవాళ్ల స్వేచ్ఛను రక్షిస్తున్నామనే భ్రమలో అర్థంలేని వాదనలు చేస్తున్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలను టచ్ చేసే ప్లాట్ ఫామ అదికాదు, అలాంటి విషయాలను చర్చించే వయసు వారికి లేదు. ఇది చూసిన కొందరు యువత మరీ ఇంత ఖాళీగా ఉన్నారా? అర్థంలేని వాదనలు చేసుకుంటూ ఇలా సమయాన్ని వృథా చేస్తున్నారా? అంటూ ప్రశ్నించడమే కాకుండా.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యవత ఇంత ఖాళీగా ఇలాంటి చర్చలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) May 2, 2023
For those that missed the space yesterday: pic.twitter.com/DLA0QH4EPo
— Shiva Reddy (@NTR_Cultt) April 30, 2023
E samajam nannu erripukodu anukunna parledhu
Ilanti ammailu ante nachadhu naku
•E bestie LKs tho close ga undatam.
•Knees varaku battalu eskotam.Jeans and tshirt eskunte em kadhu bauntaru
•Andhari mundhu thagatam (evaru lenappudu thagithe em kadu).— 𝙻𝚘𝚑𝚒𝚝 𝚁𝚎𝚍𝚍𝚢 🦋🍷 (@Love_Cinemaa) April 30, 2023