తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త దర్శకులు వస్తున్నారు. తొలి చిత్రంతోనే హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ అందిస్తున్నారు. దీంతో వీరితో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ముందుకు వస్తున్నారు. నాని హీరోగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదేల తెరకెక్కించిన చిత్రం దసరా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ సినిమా సక్సెస్ మీట్ ను కరీం నగర్ లో నిర్వహించారు.
ఇటీవల తెలుగు సినీపరిశ్రమలోకి కొత్త దర్శకులు వస్తున్నారు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తున్నారు. ఒకప్పుడు కొత్త దర్శకులతో సినిమాలు చేసేందుకు వెనకాడిన పెద్ద హీరోలు సైతం.. ఇప్పుడు వారితో సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అలా ఓ కొత్త దర్శకుడితో హీరో నాని చేసిన రిస్క్ చిత్రం దసరా. కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రధారులు. శ్రీరామనవమి సందర్భంగా గత నెల 30న తెలుగుతో పాటు పలు భాషాల్లో విడుదలైన ఈ సినిమా నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. వంద కోట్లను కొల్లగొట్టింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, గోదావరిఖనికి చెందిన శ్రీకాంత్ ఓదెల తన తొలి చిత్రంతోనే విజయం సాధించాడు. సింగరేణి బ్యాక్ డ్రాప్‌లో కథను రాసుకున్న ఈ కుర్రాడు.. దాన్ని తెరపైకి ఎక్కించడంలో సఫలీకృతుడయ్యాడు.
పక్కా రా అండ్ రస్టిక్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో పలు చోట్ల సక్సెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీం నగర్ జిల్లాలో దసరా బ్లాక్ బస్టర్ దావత్ పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రి గంగుల కమలాకర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా శ్రీకాంత్ తండ్రి చంద్రశేఖర్, తల్లి, సోదరుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి తమ ఆనందాన్ని పంచుకున్నారు. తండ్రి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో నటించిన కొమరం కోరిక మేరకు శ్రీకాంత్ ఓదేల తండ్రిని చంద్రశేఖర్‌ను స్టేజీ మీదకు ఆహ్వానించారు యాంకర్ సుమ. ‘దసరా’సినిమా చాలా బాగుందని, ఈ విజయం సాధించేందుకు 12 ఏళ్ల పాటు తన కొడుకు కష్టపడ్డాడని భావోద్వేగానికి గురయ్యారు. మూవీ టీమ్ మొత్తానికి కంగ్రాచ్యులేషన్ చెప్పారు.
తన బిడ్డ గురించి ఏం చెప్పాలో అర్థమైతలేదని, కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం మైండ్ మొత్తం బ్లాక్ అయిందని అన్నారు. ఇట్ల తీస్తడని తాను కలలో కూడా అనుకోలేదన్నారు. కానీ సినిమా అంటే ఏందనేది తెలంగాణ ప్రజలందరికీ చూపించిండని గర్వపడ్డారు. ఇది ఫస్ట్ సినిమా అనుకోవడం లేదని, ఐదారు సినిమాలు చేసిన అనుభవంతో ఈ సినిమా తీసినట్లు ఉందని చాలా మంది తనకు ఫోన్ చేసి అడిగారని పుత్రోత్సాహాన్ని ప్రదర్శించారు. ఇదే క్రమంలో శ్రీకాంత్ తల్లి తార కూడా వేదికపైకి వచ్చి మాట్లాడారు. ఈ సినిమా చేస్తున్నంత సేపు తాము ఎంత టెన్షన్ పడ్డామని తల్లి చెప్పారు.
‘కానీ అమ్మా నువ్వు టెన్షన్ పడకు, నేను ఎట్లా అయినా సక్సెస్ అయితా, మంచి సినిమా తీస్తా, నేను అనుకున్నట్లు చేస్తున్నా, మీరెందుకు టెన్షన్ పడకండీ. నాకస్సలు లేనే లేదు. మీరస్సలు టెన్షన్ పడకుర్రి అని అప్పటి సంధి నుండి చెప్పిండు. అనుకున్నదీ సాధించుండు. మమ్మల్ని గెలిపించిండు‘ అని తల్లి అనగానే.. స్టేజ్ కింద ఉన్న దర్శకుడు శ్రీకాంత్ కాస్త ఎమోషనల్ అయినట్లు కనిపించారు. అలాగే ఈ సినిమాలో ఒక రోల్ పోషించిన శ్రీకాంత్ తమ్ముడు శశి కూడా స్టేజిపై రాగా.. ఫ్యామిలీ మొత్తం స్టేజిపై ఫొటోలకు పోజిచ్చారు. ఈ సందర్భంగా నాని కూడా ఎమోషనల్ స్పీచ్ చేశారు.