Viral Video: శ్రీకృష్ణ జన్మాష్టమికి ఉట్టికొట్టడం అన్నది ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం. భక్తులు ఎంతో సంతోషంతో ఉట్టికొట్టడంలో పాల్గొంటారు. గెలిచినా, ఓడినా ఆ ప్రయత్నంలోనే ఆనందం పొందుతుంటారు. అయితే, ఉట్టికొట్టడంలోనూ ఒక్కో చోట ఒక్కో పద్దతి అమల్లో ఉంటుంది. కొన్ని చోట్ల ఒక్కరే కర్రతో నేలపైనుంచి ఉట్టికొడతారు. మరికొన్ని చోట్ల భక్తులు ఒకరిపై ఒకరు ఎక్కి అడుగుల ఎత్తులో ఉన్న ఉట్టికొడతారు. ముంబైలో దీన్నే ‘‘దహీ హండి’’ అంటారు. దహీ హండి సమయాల్లో చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆగస్టు 19వ తేదీ జరిగిన జన్మాష్టమి వేడుకల్లో ఉట్టికొడుతూ ఓ యువకుడు గాయపడ్డాడు. చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు విడిచాడు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని ముంబైలో శ్రీకృష్ణాష్టమి సందర్బంగా ‘దహీ హండి’ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. పిరమిడ్ రూపంలో ఒకరిపై ఒకరు చేరి అడుగుల ఎత్తులో ఉన్న ఉట్టిని చేరారు. సందేశ్ దల్లి అనే యువకుడు అందరికంటే పైన ఉండి ఉట్టికొట్టాడు. ఆ తర్వాత కాళ్లు పట్టుతప్పాయి. ఉట్టిని పట్టుకుని వేలాడాడు. ఆ వెంటనే కిందున్న వ్యక్తి అతడి కాళ్లను సహాయం కోసం పట్టుకున్నాడు. కింద వ్యక్తి పట్టుకున్నాడు కదా అని సందేశ్ ఉట్టిని వదిలేశాడు. దీంతో ఇద్దరూ పట్టుతప్పి కిందపడ్డారు.
ఆ పడ్డ పడ్డం సందేశ్ తల కిందున్న జనాన్ని దాటి నేలకు బలంగా తాకింది. తీవ్ర గాయమైంది. దీంతో అతడ్ని వెంటనే కూపర్ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి బాగోలేకపోవటంతో కుటుంబసభ్యులు అతడ్ని కూపర్‌నుంచి నానావతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సందేశ్ కన్నుమూశాడు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. దహీ అండీ కార్యక్రమాన్ని నిర్వహించిన వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) August 24, 2022
ఇవి కూడా చదవండి : ఇదేం ఫ్యామిలీ రా బాబు.. శవాన్ని పక్కన పెట్టుకుని ఇదేం పని!