పెళ్లి పీటలు ఎక్కిన ప్రముఖ నటి.. ఫోటోలు వైరల్..!

ఈ నెలలోనే టాలీవుడ్ అగ్ర హీరో శర్వానంద్ ఓ ఇంటి వాడయ్యాడు. రక్షితా రెడ్డిని డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నాడు. అలాగే మెగా ఫ్యామిలీలో ఆరడుగుల అందగాడు వరుణ్ తేజ్- నటి లావణ్య త్రిపాఠి ఈ నెలలోనే ఎంగేజ్ మెంట్ చేసుకోనున్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రముఖ నటి

ఇటీవల సినిమా పరిశ్రమలో వరుసగా నటీనటులు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ నెలలోనే టాలీవుడ్ అగ్ర హీరో శర్వానంద్ ఓ ఇంటి వాడయ్యాడు. రక్షితా రెడ్డిని డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నాడు. అలాగే మెగా ఫ్యామిలీలో ఆరడుగుల అందగాడు వరుణ్ తేజ్- నటి లావణ్య త్రిపాఠి ఈ నెలలోనే ఎంగేజ్ మెంట్ చేసుకోనున్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అలాగే అక్కినేని ఇంట్లో కూడా భాజాలు మోగుతాయని రూమర్లు షికార్లు చేస్తున్నాయి. నాగార్జున మేనకోడలు.. సుప్రియ, యంగ్ టాలెంటెడ్ అడవి శేష్ కూడా ఈ నెలలో పెళ్లి చేసుకోబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

అయితే ఇప్పుడు ఓ నటీ మణి ఇల్లాలు అయ్యింది. బాలీవుడ్ ప్రముఖ నటి సోనాలి సైగల్.. తన చిరకాల స్నేహితుడు అపేష్ ఎల్ సజ్నానీని పెళ్లి చేసుకుంది. బాలీవుడ్‌లో తన తొలి సిరీస్ ‘ప్యార్ కా పంచ్‌నామా’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ నటి. ఆ తర్వాత ప్యార్ కా పంచ్ నామా -2లో కూడా కనిపించింది. వీరి పెళ్లి ముంబయిలో అంగరంగ వైభవంగా జరిగింది. కార్తీక్ ఆర్యన్ తో సహా పలువురు వీరి పెళ్లికి హాజరై.. అభినందనలు తెలిపారు. అతను ముంబైలో ఓ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నాడు. ఎంతో కాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ ఈ రోజు మూడు ముళ్లతో ఏకమయ్యారు. పెళ్లి తర్వాత ఈ జంట కెమెరాలకు ఫోజులిచ్చారు. వధువు గులాబీ రంగు, వరుడు తెలుపు రంగు దుస్తులు ధరించారు. అలాగే ఆమె పెళ్లి వేదికపైకి వచ్చేటప్పటికీ.. తన కుక్కను వెంట తెచ్చుకోవడం గమనార్హం.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed