ప్రేమికుల మధ్య గొడవలు రావడం సహజం. వెంటనే.. నాన్న, బుజ్జి, బంగారం అంటూ కాసేపు ప్రేమ ఒలకబోసుకుంటే ఆటోమేటిక్ గా మళ్లీ లైన్ లోకి వస్తారు. ఇది మనకు తెలిసిన విషయం. అయితే.. ఈ ప్రేమికులను చూడండి.. ఎలా కొట్టుకుంటున్నారో. కావాలని అలా చేశారో.. లేక నిజంగానే జరిగిందో తెలియదు గానీ.. ప్రేమికులకు సంబంధించిన ఈ వీడియో మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది.
ఢిల్లీలోని మెట్రో రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు వెళ్తూ ఉండగా, ప్రయాణికుల సమక్షంలో ప్రేమికుల మధ్య గొడవ మొదలవుతుంది. ముందుగా యువతి తన చేతిలోని టీ షర్ట్‌ను ప్రేమికుడికి చూపించి.. రూ.1000కి కొన్నా అని చెబుతుంది. ఇందుకు సమాధానంగా అతను.. అంత ధర ఉండదు.. ఆ టీ షర్ట్ రూ.150కే దొరుకుతుందని ఫన్నీగా అన్నాడు. దీంతో, ఆమె కోపంతో ఊగిపోయి.. యువకుడి చెంప చెల్లుమనిపించింది. కొద్ది సేపటి తర్వాత యువకుడు కూడా ఆమెను కొడతాడు. దీంతో ఆమె ‘‘ ఇంటికెళ్లి మా అమ్మకు చెప్పి.. నీ సంగతి చెబుతా’’.. అంటూ రైలు దిగి వెళ్లిపోతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. వీళ్లు కావాలనే అలా ప్రాంక్ చేశారని కొందరు అంటుంటే.. వీళ్లకి వివాహమైతే భవిష్యత్తులో పరిస్థితి ఇంకెలా ఉంటుందో.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.
Delhi metro entertainment 😂😂pic.twitter.com/LLdIDHB54N
— kartik (@Kartik_sharmaji) July 12, 2022
ఇది కూడా చదవండి: Viral Video: ఐస్ క్రీమ్ ధరపై నెట్టింట వైరల్ అవుతున్న తల్లి-కొడుకుల క్యూట్ వీడియో..!
ఇది కూడా చదవండి: Video: సోషల్ మీడియాలో మునిగిపోయిన కోతులు..