నీళ్ల అడుగున ప్రేమ జంట ముద్దులాట.. ఏకంగా 4 నిమిషాల పాటు..

వాలెంటైన్స్‌ డే వచ్చిందంటే చాలు ప్రేమ జంటలు సంతోషంలో మునిగిపోతాయి. తమకిష్టమైన వారికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్‌లు ఇవ్వటానికి రెడీ అయిపోతాయి. అంతేకాదు! లోకోభిన్న రుచి అన్నట్లు కొంతమంది రికార్డులు సృష్టించడానికి తీరుకుంటారు.

  • Written By:
  • Publish Date - February 15, 2023 / 12:27 PM IST

జిహ్మకో రుచి, పుర్రెకో బుద్ధి అన్నట్లు అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. ప్రేమ జంటల్లో కూడా ఒక్కోరి ఆలోచనా తీరు ఒక్కో విధంగా ఉంటుంది. అంతేకాదు! వాలెంటైన్స్‌ డేను ఎంతో కొత్తగా, అందరికంటే భిన్నంగా చేసుకోవాలని కొందరు భావిస్తుంటారు. ఇలా ఆలోచించిన ఓ ప్రేమ జంట ఓ కొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. వాలెంటైన్స్‌ డేను తమతో పాటు లోకానికి కూడా గుర్తుండిపోయేలా చేసింది. నీళ్ల అడుగున 4 నిమిషాలపైనే ముద్దు పెట్టుకుంది. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సైతం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌత్‌ ఆఫ్రికాకు చెందిన బెత్‌ నీలే.. కెనడాకు చెందిన మైల్స్‌ క్లోటియర్‌ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.

వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఏదైనా రికార్డు క్రియేట్‌ చేయాలని వారు భావించారు. స్వతహాగా ఫ్రీడైవర్స్‌ అయిన వీళ్లు తమ ఫీల్డ్‌లోనే గిన్నిస్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేయాలని అనుకున్నారు. వీరిద్దరూ ఎలాగూ ప్రేమికులు కాబట్టి నీళ్ల అడుగున ముద్దు పెట్టుకోవాలని నిశ్చయించుకున్నారు. అది కూడా గిన్నిస్‌ రికార్డు సాధించేంత సమయం. ఇందుకోసం చాలా కష్టపడ్డారు. కొన్ని నెలల పాటు ట్రైనింగ్‌ తీసుకున్నారు. నీళ్ల అడుగున ఎక్కువ సేపు ఉండటం ఎలాగో బాగా ప్రాక్టీస్‌ చేశారు. తాజాగా, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధుల ముందు నీళ్ల అడుగున ముద్దు పెట్టుకున్నారు. దాదాపు 4 నిమిషాల 6 సెకన్లు ముద్దు పెట్టుకున్నారు.

3 నిమిషాల 24 సెకన్లపై ఉన్న పాత రికార్డును తుడిచిపెట్టేశారు. కొత్త రికార్డును సృష్టించారు. గిన్నిస్‌ రికార్డులోకి ఎక్కారు. ఇందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సంస్ధ తమ అఫిషియల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నీళ్ల అడుగున ఎక్కువ సేపు గాలి తీసుకోకుండా ఉండటం చాలా కష్టం’’.. ‘‘ ఏది ఏమైనా ఇలా నీటి అడుగున ముద్దు పెట్టుకోవటం ఓ గొప్ప అనుభూతి’’ ..‘‘ స్వామి కార్యం.. స్వ కార్యం రెండూ అయ్యాయిగా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV