సముద్ర గర్భంలో విలువైన సంపద ఉంటుందని మనం అంచనా వేయటం సహజం. ఇప్పటికీ పలు దేశాలు ఇలాంటి పరిశోధనలు చేస్తూ ఉన్నాయి. ఇలా పరిశోధన చేస్తున్న దేశాల్లో ఒకటైన కొలంబియా ప్రభుత్వం.. రెండు శతాబ్దాల కిందట సముద్రలో మునిగిపోయిన రెండు నౌకలను గుర్తించింది. ఇందులో గుట్టల కొద్దీ బంగారు నాణేలు, ఇతర వస్తువులు ఉన్నట్లు తెలిసింది.
1708 సంవత్సరం, జూన్ 8న కొలంబియాలోని కార్టాజినా సముద్ర తీరంలో స్పానిష్, బ్రిటిష్ వారికి యుద్ధం జరిగింది. ఈ దాడుల్లో స్పెయిన్ కు చెందిన శాన్ జోస్ అనే యుద్ధ నౌక మునిగిపోయింది. ఆ సమయంలో నౌకలో 600 మంది ప్రయాణికులతో పాటు బంగారు ఆభరణాలు, రత్నాలు వంటివి కూడా ఉన్నాయి. ఈ నౌక శిధిలాలను మొదటగా 2015లో గుర్తించిన కొలంబియా అధికారులు.. అప్పటి నుంచి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే అత్యాధునిక సాంకేతిక సాయంతో సముద్ర గర్భంలోకి రిమోట్ కంట్రోల్ వాహనాన్ని పంపింది. ఈ క్రమంలోనే శాన్ జోస్ నౌక మునిగిన ప్రాంతానికి సమీపంలో మరో రెండు నౌకల శిథిలాలు ఉన్నట్లుగా తాజాగా గుర్తించింది. ఇందులో గుట్టల కొద్దీ బంగారు నాణేలు, ఇతర వస్తువులు ఉన్నట్లు తెలిసింది. వీటి విలువ 17 బిలియన్ డాలర్ల పైనే ఉంటుందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.32లక్షల కోట్లకు పైమాటే.
— Govardhan Reddy (@gova3555) June 10, 2022
ఇది కూడా చదవండి: Dragon Blood Tree: ఇదెక్కడి వింత.. చెట్టు నుంచి రక్తం కారుతోంది.. ఎందుకిలా!
కార్టాజినా తీరానికి 3100 అడుగుల లోతులో ఈ నౌకలు ఉన్నట్లు గుర్తించిన కొలంబియా ప్రభుత్వం.. ఆ దృశ్యాలను విడుదల చేసింది. నౌకల శిథిలాల్లో బంగారు నాణేలతో పాటు చెల్లాచెదురుగా పడి ఉన్న కుండలు, పింగాణీ కప్పులు కూడా కన్పిస్తున్నాయి. ఈ రెండు నౌకల్లో ఒకటి కలోనియల్ బోట్, మరొకటి షూనర్ అని అక్కడి అధికారులు ద్రువీకరించారు. 1810లో స్పెయిన్ నుంచి కొలంబియాకు స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ఈ నౌకలు మునిగిపోయి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు రెండు శతాబ్దాల కిందటివి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.