ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతటి అద్భుత విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రభావం ప్రతి ఒక్కరిపై పడింది. సామాన్యుల నుంచి సెలబ్రీటిల వరకు అందరు ఈ సినిమాలోని పాటలను, డైలాగ్స్ ను, డాన్స్ అనుకరిస్తూ తెగ రచ్చ చేస్తున్నారు. ఈ సినిమాలోని డైలాగ్స్ ను ట్రాఫిక్ పోలీసులు సైతం ప్రచారం కోసం ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు కలెక్టర్.. తన మాతృభాష కానప్పటికి తెలుగులో పుష్ప లోని ఓ సాంగ్ పాడారు. పుష్ప మూవీలోని శ్రీవల్లి సాంగ్ పాడి అందరిని ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళనాడులోని కరూర్ జిల్లాకు కలెక్టర్ పనిచేస్తున్న ప్రభుశంకర్.. శ్రీవల్లి పాటను అద్భుతంగా పాడి.. అందుకు తగ్గట్లుగా గిటార్ కూడా వాయించారు. ఆ కలెక్టర్ పాడిన విధానం చూస్తే.. నిజంగా సింగరేమో అనే సందేహం రాక మానదు. కలెక్టర్ ప్రభు శంకర్ పాడిన ఈ పాట ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తన మాతృభాష తెలుగు కానప్పటికి .. ఆ భాష రాకున్నా.. స్పష్టంగా శ్రీవల్లి పాటను కలెక్టర్ పాడారు. కలెక్టర్ పాడిన పాట వింటుంటే చెవులో అమృతం పోసినట్లు ఉందని కొందరు నెటిజన్లు కామెంట్స చేస్తున్నారు. మరి.. వీడియోపై మీరు ఓ లుక్కేయండి.మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.