స్వామియే శరణం అయ్యప్ప.. మాలధారణ సమయంలో అయ్యప్ప భక్తులు ఈ ఒక్క మాటనే తారక మంత్రంగా భావిస్తారు. మండల కాలం పాటు.. సంసార బంధాలను దాటుకుని స్వామి నామస్మరణలో ప్రశాంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతారు. మాలాధారణ కాలం పూర్తి అయ్యాక.. భక్తులు వివిధ మార్గాల్లో శబరిమలకు చేరుకుంటూ ఉంటారు. కొందరు భక్తులు కాలినడకన కూడా శబరిమలకి వెళ్తుంటారు.
ఈ క్రమంలో ఇద్దరు చిన్నారులు అయ్యప్ప స్వామి మాలవేసుకుని, నెత్తిపై ఇరుముడి పెట్టుకుని కాలినడకన మణికంఠ స్వామి దర్శనానికి బయలుదేరారు. ఈ అన్నాచెల్లెళ్లు “స్వామియే శరణం అయ్యప్ప” అంటూ సుమారు 580 కిలోమీటర్లు పాటు ప్రయాణించి కేరళలోని శబరిమలకు చేరుకున్నారు. ఈ బాల స్వాములు కాలినడకన వెళ్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బెంగుళూరు నుంచి ఈ అన్నాచెల్లెళ్ల కాలినడక యాత్ర కొనసాగింది. ఈ క్రమంలో చిన్నారులు నిండ ఆధ్యాత్మిక భావంతో కాలినడక యాత్ర సాగించారు . ఈ చిన్ని స్వాముల పట్టుదల, ధైర్యం, భక్తిని చూసి.. రోడ్డు వెంబడి ఉండే జనం సైతం ఆశ్చర్యపోయారు. కొందరైతే అయ్యప్ప దర్శనం వెళ్తున్నా ఆ చిన్నారులకు తమకు చేతనైన మేర కానుకుల ఇస్తూ నమస్కారం చేసుకున్నారు. కాగా ఈ అన్నాచెల్లెళ్ల యాత్రకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చిన్నారులకు స్వామి స్వామి వారి ఆశ్సీసులు పుష్కలంగా ఉండాలి. వీరు క్షేమంగా వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి అని ఈ వీడియో చూసిన నెటిజన్స్ కోరుకున్నారు. మీరు ఈ బాల స్వాముల భక్తి శ్రద్దలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
శరణుఘోషతో ఆ మణికంఠుడిని స్మరించండి. భక్తిమార్గంలో కొనసాగండి… స్వామియే శరణమయ్యప్ప
🙏🙏🙏 pic.twitter.com/xwRjVJvlHN— Saradhi (@SaradhiTweets) January 6, 2022