భారతదేశంలో వివిధ జాతులు, మతాల ప్రజలు మాత్రమే కాదు.. మరో రెండు వర్గాలకు చెందిన వారు కూడా ఉన్నారు. అదే పేద, ధనిక వర్గం ప్రజలు. ఒకరేమో.. తినడానికి పట్టెడన్నం దొరక్క ఇబ్బంది పడేవారైతే.. తినలేక.. ఆహారాన్ని వృథా చేసేవారు కొందరు. నేటికి కూడా పూరి గుడిసెలో.. కొవ్వొత్తుల వెలుగులో బతుకున్నవారు ఎందరో ఉన్నారు. నెలకో స్మార్ట్ ఫోన్ మార్చే వారి పక్కనే.. స్లిప్పర్‌తో సెల్ఫి దిగే ఆనందించే జనాలున్నారు. మరో 100 ఏళ్లు గడిచినా.. ఈ అంతరాలు మాత్రం మాసిపోవు. ఇళ్లల్లోనే హోమ్ థియేటర్‌లు, గదికో టీవీ ఏర్పాటు చేసుకోగలిగే జనాలు ఓ పక్క ఉండగా.. రోడ్ల మీద టీవీ షోరూం ముందు కూర్చుని.. అద్దాల వెనక నుంచి.. టీవీ చూస్తూ ఆనందించే అల్ప సంతోషులు నేటికి కూడా మన సమాజంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే ఓ టీవీ షోరూం ఉంది. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం టీవీ షోరూంలో.. కొన్ని టీవీలు నిత్యం ఆన్‌లోనే ఉంటాయి కదా. అలానే ఈషాప్‌లో కూడా రోడ్డు మీద వచ్చి పోయే కస్టమర్ల దృష్టిని ఆకర్షించడం కోసం పెద్ద టీవీని.. రోడ్డుకు ఎదురుగా ఏర్పాటు చేశారు షోరూం నిర్వాహకులు. పక్కనే ఉండే ఇద్దరు పిల్లలు ఫుట్ ఫాత్ మీద కూర్చుని.. రోడ్డుకు ఎదురుగా ఏర్పాటు చేసిన టీవీలో.. వచ్చే దృశ్యాలను ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఆ పిల్లలను చూస్తే.. ఒంటి మీద సరైన దుస్తులు లేవు.. కాళ్లకు చెప్పులు లేవు. కనీస శుభ్రత లేకుండా ఉన్నారు.
టీవీ తెర మీద రంగురంగులు బొమ్మలు కదలుతుంటే.. ఎవరిని మాత్రం ఆకర్షించవు. దాంతో పిల్లలు ఇద్దరు షోరూం బయట ఉన్న ఫుట్‌పాత్ మీద కూర్చుని.. టీవీలో వచ్చే బొమ్మలను ఆసక్తిగా గమనిస్తుంటారు. చిన్నారులను గమనించిన టీవీ షో రూం యజమానో లేక వర్కరో వారి దగ్గరకు వచ్చి.. మీకు ఏ బొమ్మలు చూడాలని ఉందని.. అడిగి మరీ పిల్లలు కోరుకున్న ప్రొగ్రాం పెడతాడు. అయితే ఎవరో ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఈ వీడియో వైరలవుతోంది. సదరు టీవీ షోరూం ఓనర్ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు.
ఈ పిల్లలను చీదరించుకోని.. అక్కడి నుంచి తరిమేయకుండా.. వారు కోరిన ప్రొగ్రాం పెట్టావ్ చూడు.. నీ మంచి మనసుకు హ్యాట్సాఫ్.. నీలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు అని కామెంట్స్ చేయగా.. మరికొందరు మాత్రం.. మన దేశంలో పేదరికం ఎప్పటికి అంతమవుతుందో.. ఇలాంటి దృశ్యాలు చూస్తే.. గుండెలు మెలిపెట్టిన ఫీలింగ్ కలుగుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి షోరూం యజమాని చేసిన పని మీకెలా అనిపించింది.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.