ఈ రోజుల్లో బిర్యాని అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పిండి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ బిర్యాని పేరు చెబితేనే చాలు.., నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. అలాంటి బిర్యానిని ప్రతీ ఒక్కరూ ఇష్టపడుతుంటారు. కానీ, పెరుగుతున్న నిత్యవసర ధరలు, కోళ్ల పెంపకం తక్కువగా జరుగుతుండడంతో రోజు రోజుకు చికెన్ కు డిమాండ్ పెరుగుతుంది. తద్వారా చికెన్ ధరలు ఆకాశానంటుతున్నాయి. ఈ క్రమంలోనే చికెన్ బిర్యాని రేటు కూడా క్రమ క్రమంగా పెరుగుతుండడం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం రెస్టారెంట్ ను బట్టి చికెన్ బిర్యాని రెటు ఉంటుంది. మామలుగా ఎక్కడ మనం బిర్యాని తిన్న తక్కువలో తక్కువగా రూ.150 మించి ఉండదు.
కానీ ఏపీలోని ఓ చోట మాత్రం రూ.2లకే ఘుమ ఘుమలాడే చికెన్ బిర్యాని పెడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనాలు ఒక్కసారిగా ఎగబడుతున్నారు. అసలు రూ.2 బిర్యాని పెట్టడం ఏంటి? అసలు ఈ చికెన్ బిర్యాని ఎక్కడ పెడుతున్నారనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకుని నందమూరి తారకరామారావు, బాలకృష్ణ, అభిమానులు హిందూపురంలోని ప్రభుత్వ ఆస్పత్రి ముందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే రోగులతో పాటు అన్నార్తులకు, పేదలకు భోజనాలు పెట్టి వారి ఆకలి తీరుస్తున్నారు.
అయితే ఇక్కడికి ఆపదలో వచ్చే వారి కడుపు నింపేందుకు నిర్వాహకులు రూ.2కే చికెన్ బిర్యానిని వడ్డిస్తూ పేదల ఆకలిని తీర్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, ఎన్టీఆర్ అభిమానులు, పేదలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఇక వచ్చినవారందరికీ రూ.2కే బిర్యానిని వడ్డిస్తున్నామని నిర్వాహికులు చెబుతున్నారు. బిర్యానితో పాటు స్వీటు, కోడి గుడ్డు పెడుతున్నామని వారు తెలిపారు. ఇందులో భాగంగానే మంగళవారం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి ముందు భోజనాలు ఏర్పాటు చేసి దాదాపుగా 300 మందికిపైగా ఆకలి తీర్చామని తెలిపారు. అయితే నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు నేటికి 200 రోజులు పూర్తైన సందర్భంగా.. ఇలా రూ.2కే బిర్యానిని ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు.