చెప్పినా వినలేదు.. కూతురు శవాన్ని భుజంపై వేసుకుని వెళ్లిపోయాడు..

  • Written By:
  • Publish Date - March 26, 2022 / 01:12 PM IST

viral video : ఈ మధ్య కాలంలో చనిపోయిన సొంత వారి శవాలను భుజాలపై మోసుకెళ్లటం.. సైకిల్‌ మీద తీసుకెళ్లటం వంటి దృశ్యాలు చాలా వైరల్‌ అయ్యాయి. అలా వాళ్లు శవాలను భుజాలపైనో.. సైకిల్‌ పైనో తీసుకెళ్లటానికి బలమైన కారణాలు ఉన్నాయి. వాహన సౌకర్యం లేక, ఆర్థిక స్తోమత సరిపోక అలా చేశారు. తాజాగా, ఓ వ్యక్తి డాక్టర్లు శవాల వాహనం వస్తుందని చెప్పినా వినకుండా చనిపోయిన కూతురు శవాన్ని భుజాలపై వేసుకుని ఊరికి బయలుదేరాడు. దాదాపు 10 కిలోమీటర్లు నడిచాడు ఈ సంఘటన ఛత్తీష్‌ఘర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సురుగుజా జిల్లా, ఆమ్‌దాలా గ్రామానికి చెందిన ఈశ్వర్‌ దాస్‌ కూతురు సురేఖ కొద్దిరోజుల క్రితం అనారోగ్యం పాలైంది. దీంతో పాపను లఖన్‌పుర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు.

అక్కడ చికిత్స పొందుతూ 7.30 గంటల ప్రాంతంలో పాప మరణించింది. అక్కడి వైద్యులు పాప శవాన్ని ఇంటికి తరలించటానికి వాహనం వస్తుందని, అంతవరకు వేచి ఉండమని ఈశ్వర్‌కు చెప్పారు. అయితే, అతడు ఇదేమీ పట్టించుకోకుండా కూతురు శవాన్ని భుజంపై వేసుకుని ఇంటికి బయలు దేరాడు. ఈ దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఓ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. సహాయం చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి : ఇదో అసాధారణ ప్రేమకథ.. వీరి ప్రేమను నిలబెట్టుకునేందుకు ఏం చేశారంటే?

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV