భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కొందరు అవసరాన్ని బట్టి ఆ కళను ప్రదర్శిస్తుంటారు. మరికొందరు తమకు టాలెంట్ ఉన్నది అనే విషయమే మరచి పోతారు. అగ్గిపెట్టెల చీరను పెట్టె నైపుణ్యం గురించి మనం తెలిసిందే. తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా నెల్లూరు జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు తన ప్రతిభను చాటారు. ప్రతి ఒక్కరికీ నిత్యం అవసరమైన క్యాలెండర్ ను తనదైన స్టైల్లో అతిచిన్నగా రూపొందించి శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ నెల్లూరు వాసి తన ఈ సూక్ష్మకళ నైపుణ్యంతో అందరిని ఆకట్టుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం యాచవరానికి చెందిన సూక్ష్మకళాకారుడు ఆలూరు రామాచారి తన టాలెంట్ను ప్రదర్శించారు. కొత్త ఏడాది సందర్భంగా అగ్గిపెట్టెలో పట్టేంత క్యాలెండర్ను రూపొందించారు. శుక్రవారం దీన్ని ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ లో వారాలు, తిథులు, నక్షత్రాలు, పండగల వివరాలు అన్ని పేర్కొన్నారు. అగ్గిపెట్టెలో పట్టేంత క్యాలెండర్ తయారు చేసిన రామాచారి కళానైపుణ్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.