Viral Video: ఏదైనా నగల షాపు, కార్ల షోరూం లాంటి వాటి ప్రారంభోత్సవానికి హీరోయిన్స్‌ను రిబ్బన్ కటింగ్ కోసం పిలవటం సర్వ సాధారణం. అలాగే ఏదైనా ఒక ఊర్లో ప్రజలకు సంబంధించిన వాటి ప్రారంభోత్సవాలు జరిగినపుడు ప్రజా ప్రతినిధులను రిబ్బన్ కటింగ్ కోసం పిలుస్తుంటారు. కానీ, కర్ణాటకలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు బస్ షెల్టర్ ప్రారంభోత్సవానికి ఓ దున్నపోతును ముఖ్య అతిధిగా పిలిచారు. దానితోనే రిబ్బన్ కటింగ్ చేయించారు. ఇంతకీ వాళ్లు అలా ఎందుకు చేశారంటే.. కర్ణాటక, కొడగు జిల్లాలోని బాలెహొసూర్‌లో ఓ పాత బస్ షెల్టర్ ఉంది.
అది 40 సంవత్సరాల క్రితం కట్టించింది కావటంతో శిథిలావస్థలోకి చేరి కూలిపోయింది. తర్వాత ఆ ప్రదేశాన్ని కొందరు చెత్తను వేసే చోటుగా మార్చారు. దీంతో ప్రయాణికులు బస్ కోసం ఎదురు చూడాల్సి వచ్చినపుడు అక్కడి హోటళ్లలోనో.. ఇళ్లలోనో ఉండాల్సిన పరిస్థితి. వానా కాలం ఈ పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. ఇక, ప్రజలు చాలా రోజుల నుంచి తమకు ఓ బస్ షెల్టర్ కట్టించి ఇవ్వమని ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. అయినప్పటికి ఏ లాభం లేకపోయింది.
ఇక, ఇలా అయితే ప్రభుత్వ అధికారులు స్పందించరని భావించిన ప్రజలు.. అధికారుల దృష్టి ఆకర్షించటానికి ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సొంత ఖర్చులతో ఓ చిన్న బస్ షెల్టర్‌ను నిర్మించారు. దాని ప్రారంభోత్సవానికి ఏకంగా దున్నపోతును తీసుకెళ్లారు. దాని తోనే బస్ షెల్టర్ రిబ్బన్ కట్ చేయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, బస్ షెల్టర్‌కు దున్నపోతుతో రిబ్బన్ కటింగ్ చేయించిన ప్రజల ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Villagers make a buffalo do the ribbon cutting ceremony of a bus shelter in #Balehosur village of #Gadag as the local administration ignored the demand for restoration for many years @NewIndianXpress @XpressBengaluru @KannadaPrabha @raghukoppar @NammaBengaluroo @karnatakacom pic.twitter.com/02kKvqm566
— Amit Upadhye (@Amitsen_TNIE) July 19, 2022
ఇవి కూడా చదవండి : Kanwar Yatra: కలియుగ శ్రవణుడు.. కన్నవాళ్లని కావడిలో కూర్చొబెట్టుకుని మోసుకెళ్తూ..!