ప్రభుత్వం నిర్వహించే పనులు, కాంట్రాక్ట్‌లు అంటే జనాల్లో దాని నాణ్యత గురించి పెద్దగా మంచి అభిప్రాయం ఏం ఉండదు. ఎప్పుడో ఓ రోజు కుప్పకూలుతుంది అని బలంగా ఫిక్సవుతారు. మన దగ్గరనే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అవినీతి లేని దేశాలు ప్రపంచంలో చాలా తక్కువ. మన దేశం, మన ప్రజల కోసం పని చేస్తున్నాం అనే భావన ఎవరిలో ఉండదు. ఎవరి లాభం వారు చూసుకుంటారు. తాజాగా నెట్టింట వైరలవుతున్న ఓ వీడియో చూసిన జనాలు.. అరే మా దేశంలో కూడా ఇలానే జరుగుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే.. వర్షాకాలంలో నదిని దాటేందుకు ఇబ్బందిగా ఉండటంతో.. ఓ నదిని నిర్మించారు. ఇక ప్రారంభించే రోజు వచ్చింది. అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక చీఫ్ గెస్ట్ వచ్చి రిబ్బన్ కట్ చేయగానే.. వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో ఈ ఘటన జరిగింది. నది మీద ఉన్న పాత వంతెన కూలిపోయింది. దాంతో అధికారులు కొత్త వంతెన నిర్మాణం ప్రాంరభించారు. అది పూర్తయ్యి.. ప్రారంభించే రోజు వచ్చింది. చీఫ్ గెస్ట్ వచ్చి రిబ్బన్ కట్ చేశారు. అంతే అనుకోకుండా ఆ వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఓ మహిళా అధికారి కింద పడబోతుండగా.. సెక్యూరిటీ సిబ్బంది ఆమెను కాపాడారు. ఇక మిగతావారికి కొద్దిపాటి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో వంతెన పూర్తిగా కిందకు కూలకపోవడంతో.. పెద్ద ప్రమాదం తప్పింది. ఇక మిగతా వారంతా.. ఎలాగోలా కిందకు దిగి ప్రమాదం నుంచి బయటపడ్డారు. కొన్ని గంటల తర్వాత ఆ వంతెన మొత్తం కూలిపోయినట్లు స్థానికులు తెలిపారు.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా.. ఇప్పటికే సుమారు 6.5మిలియన్లకు పైగా మంది దీన్ని చూశారు. ఇక నాసిరకం పనులపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రారంభం రోజే కూలిపోయిందంటే.. నిర్మాణంలో ఎంత నాణ్యత పాటించారో బాగా అర్థం అవుతుంది.. మా దగ్గరే అనుకున్నాం.. చాలా దేశాలు ఇలానే ఉన్నాయా అంటూ నెటిజనులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. మిలియన్ల ప్రజాధనాన్ని వృథా చేశారంటూ చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Bridge collapses while being commissioned in DR Congo. pic.twitter.com/hIzwKWBx9g
— Africa Facts Zone (@AfricaFactsZone) September 5, 2022