పెళ్లికి పెళ్లికి మధ్య వ్యత్యాసం జరిగే తీరులోనే ఉంటుంది. పెళ్లిలో చెప్పుకోవటానికి ఎన్ని సంఘటనలు జరిగితే అన్ని ఏళ్ల పాటు ప్రజల్లో గుర్తు ఉండిపోతుంది. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో అయితే, వైరల్‌గా కూడా మారిపోతుంది.
పెళ్లంటే నూరేళ్ల పంట. పెళ్లి బంధంతో ఒక్కటి కాబోయే ఇద్దరి జీవితాల్లో గుర్తిండిపోయే ఘట్టం. పెళ్లి రోజున చోటుచేసుకునే వింత, విచిత్రమైన సంఘటనలు జీవితాంతం గర్తుండిపోతాయి. సోషల్ మీడియా వాడకం ఉధృతంగా ఉన్న ఈ రోజుల్లో అయితే పెళ్లిలో చోటుచేసుకునే విచిత్ర సంఘటనలు వైరల్‌గా మారి.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. తాజాగా, ఓ పెళ్లిలో పెళ్లి కూతురు వ్యవహరించిన తీరు నెటిజన్లను భలే నవ్విస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతి పెళ్లి తెల్లవారు జామున జరుగుతోంది. దీంతో సరైన నిద్రలేక ఆ పెళ్లి కూతురు బాగా అలిసిపోయింది.
పెళ్లంటే మాటలా.. పంతులు కనీసం గంటపాటైన మంత్రాలు చదవాలి కదా.. పంతులు మంత్రాలు చదువుతున్న సమయంలో పెళ్లి కూతురికి నిద్ర ముంచుకు వచ్చింది. పంతులు జోల పాట పాడినట్లు ఉండేసరికి పెళ్లి పీటల మీదే నిద్రపోయింది. పెళ్లి కూతురు ఉలుకుపలుకు లేకుండా ఉండటంతో అందరూ ఆమె వైపు చూశారు. ఆమె నిద్రపోతుండటం చూసి, పెళ్లి కుమారుడు చేత్తో తట్టి లేపాడు. టక్కున నిద్రలేచిన ఆమె అందరూ తనవైపే చూస్తూ ఉండటంతో సిగ్గుపడింది. ఆ వెంటనే నవ్వటం స్టార్ట్ చేసింది. మహేష్ ఫోటో గ్రఫీ వైజాగ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారుడు ఈ వీడియోను షేర్ చేశాడు.
వైరల్‌గా మారిన ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..‘‘తెల్లవారు జామున పెళ్లి పెట్టుకుంటే ఇలానే ఉంటుంది’’.. ‘‘ ఇలాంటి ఫన్నీ సంఘటనలే కదా జీవితాంతం గుర్తుండిపోయేవి’’.. ‘‘పాపం తను మాత్రం ఏం చేస్తుంది.. ముహూర్తాలు తెల్లవారుజామున 2 గంటలకు 3 గంటలకు పెడుతున్నారు’’.. ‘‘ పెళ్లి కూతురు వెనకాల ఉన్న ఆ పిల్లని చూడండి.. షాక్‌లో ఉంది పాపం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, పెళ్లి పీటలపై నిద్రపోయిన ఈ పెళ్లి కూతురు ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.