పెళ్లి మండపాల్లో వింత వింత సంఘటనలు చోటు చేసుకోవడం ఈమధ్య కాలంలో బాగా పెరుగుతున్నాయి. పెళ్లిలో రకరకాల స్టంట్లు చేసి.. వార్తల్లో నిలుస్తున్నారు. ఇక తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఈమధ్యకాలంలో పెళ్లి మండపాలు వైరల్ సంఘటనలకు వేదికలుగా మారుతున్నాయి. కొన్ని నవ్వు పుట్టిస్తే.. మరి కొన్ని సంఘటనలు భయంకరంగా మారుతున్నాయి. పెళ్లి మంటపాల్లో గొడవపడే సంఘటనలే ఎక్కువగా చూశాం. పెళ్లి మంటపం మీద కొట్టుకునే వాళ్లను చూశాం. చదువు రాని వరుడు వద్దని.. పెళ్లి మధ్యలో ఆపేసి వెళ్లిన వాళ్లని చూశాం. తాగి వచ్చి పెళ్లి కుమార్తె బదులు.. పక్కవాళ్ల మెడలో తాళి కట్టబోయిన వారి గురించి కూడా చూశాం. ఇక ప్రీ వెడ్డింగ్ షూట్‌లో అపశృతుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక నేటి కాలంలో పుట్టిన రోజు వేడుకలు, వివాహాల సందర్బంగా గన్ కల్చర్ పెరిగింది. కొందరు దీపావళి తుపాకుల మోడల్ గన్‌లు వాడి స్టంట్‌లు చేస్తుండగా.. కొందరు నిజమైన తుపాకులు వాడి.. గాయాలపాలవుతున్నారు. ఇక తాజాగా పెళ్లి మండపంలో.. పెళ్లి కుమార్తె చేసిన పని.. మిస్ ఫైర్ అవ్వడంతో.. నవ వధువు ముఖం కాలింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
అదితి అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో నిడివి కేవలం 13 సెకన్లు మాత్రమే ఉంది. దీనిలో పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబైన నవ దంపతులు చేతిలో ఫైర్ గన్ పట్టకుని రెడీగా ఉంటారు. వారి ముందు కేక్ ఉంటుంది. ఇక బంధుమిత్రుల కోలాహాలం మధ్య నవ దంపతులు కేక్ కట్ చేయడానికి రెడీ అవుతారు. దీనికి ముందు నవ దంపతులు ఇద్దరు తమ చేతిలో ఉన్న గన్‌ని కాలుస్తారు. వాటి నుంచి మంటలు వస్తాయి. అయితే అనుకోకుండా ఆ మంటలు కాస్త నవ వధువు ముఖానికి అంటుకుంటాయి. దాంతో ఆమె గన్ పక్కకు పడేసి.. అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
దీనిపై నెటిజనులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. శుభామాని పెళ్లి చేసుకంటూ.. ఈ పిచ్చి ప్రయోగాలు అవసరమా.. తిక్క కుదిరింది.. లేకపోతే.. పెళ్లిలో ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు.. ఈ భయం జన్మలో పోదు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Idk what’s wrong with people these days they are treating wedding days more like parties and this is how they ruin their perfect day. 🤷♀️ pic.twitter.com/5o626gUTxY
— Aditi. (@Sassy_Soul_) March 31, 2023