పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన వేడుక. అందుకే పెళ్లిని ఎంతో ఘనంగా జరుపుకోవాలని యువత భావిస్తుంటుంది. అయితే ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే చాలా సింపుల్ గా జరిగేవి. ఇక పెళ్లి కూతురు అయితే సిగ్గు పడుతూ తల వంచుకుని తాళి కట్టించుకునేవారు. అత్తవారింటికి వెళ్లినా కూడా చాలా కాలం పాటు భయంగా ఉండేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. పెళ్లిలో హడావుడి అంతా పెళ్లి కూతురు చేతిలోనే ఉంటుంది. పెళ్లి అంటే కేవలం తలవంచుకునే తాళి కట్టించుకునే పెళ్లి కూతుర్ల కాలం పోయింది. తల ఎత్తుకునే పెళ్లిలో సందడి చేసే పెళ్లి కూతర్లు వచ్చారు. తన పెళ్లిని జీవితాంతం గుర్తుండిపోయేలా చాలా వెరైటిగా ప్లాన్ చేస్తున్నారు. సంగీత్, మెహెందీ ఫంక్షన్లు, పెళ్లి మండపం పై డ్యాన్సులతో ఇరగదీస్తున్నారు. తాజాగా ఓ వధువు తన పెళ్లిలో అదిరిపోయే డ్యాన్స్ చేసింది. పెళ్లి కూతురు డ్యాన్స్ చూసిన పెళ్లి కొడుకు షాకయ్యాడు. ప్రస్తుతం ఆ వధువు డ్యాన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా పెళ్లి రిసెప్షన్ అంటే వధువరుల తరపు బంధువులు, స్నేహితులు నృత్యాలు, డ్యాన్స్ లతో తెగ సందండి చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పెళ్లి కొడుకు కూడా స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేశాడు. అలానే వధువులు కూడా పెళ్లిలో డ్యాన్స్ లు చేస్తూ అందరిని ఆకట్టుకుంటారు. అలానే తాజాగా ఓ పెళ్లి కూతురు సినిమా రేంజ్ లో డ్యాన్స్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పెళ్లి కార్యక్రమంలో రిసెప్షన్ జరుగుతుండా మ్యూజిక్ మొదలైంది చాలా సేపు సైలెంట్ గా కూర్చున్న వధువు ఒక్కసారిగా లేచి చిందులేసింది. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’ సినిమాలోని ‘ఎక్కా చక్కా ఎక్కాచక్కా’ అనే పాటకు చిందులేసింది.
సినిమా హీరోయిన్ వేసే డ్యాన్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఆ పెళ్లి కూతురు డ్యాన్స్ చేసింది. ఇక ఆమె తోడు స్నేహితులు కలవడంతో స్టేజి కూడా దద్దరిల్లింది. వధువు ఇచ్చిన సినిమాటిక్ డ్యాన్స్ ఫెర్మామెన్స్ కి పెళ్లి కొడుకు ఫుల్ ఫిదా అయిపోయాడు. ఇక యువతి డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. పెళ్లి కూతురు డ్యాన్స్ సర్‌ప్రైజ్ అదిరిందంటూ, అలాంటి అమ్మాయి భార్యగా దొరకడం వరుడి అదృష్టమని నెటిజన్‌లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
मेरी शादी ऐसी डांस करने वाली दुल्हन और उसकी ज़रुर होनी चाहिए, नहीं तो मैं मंडप से उठकर भाग जाऊंगा 😂💃🥀 pic.twitter.com/eqk24BYXQX
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 28, 2022