viral news : ‘పిదపకాలం పిదప బుద్ధులు’ అని పెద్దలు ఊరికే అనలేదు. కాలానికి తగ్గట్టుగా బుద్దులు మారుతూ ఉంటాయనే ఉద్ధేశ్యంలో ఆ మాటన్నారు. ఈ కాలం పిల్లల్ని చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఈ కాలం చిన్నపిల్లలు చేస్తున్న పనులు చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలగకమానదు. తాజాగా, ఓ చిన్నపిల్లాడు టిక్కెట్ లేకుండానే 2700 కిలోమీటర్లు విమాన ప్రయాణం చేశాడు. టిక్కెట్ లేకుండా విమాన ప్రయాణమా.. అదేమన్నా ఎర్ర బస్సా.. అని అనుకుంటున్నారా? మీకు అసలు సంగతి తెలియాలంటే మిగిలిన స్టోరీ చదివేయండి..
బ్రెజిల్‌కు చెందిన 9 ఏళ్ల ఇమ్మాన్యుయేల్ మార్కస్ ఒలివెరా గత శనివారం ఉదయం ఇంటినుంచి పారిపోయాడు. ఇంటినుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లాడు. సావోపాలోలోని గౌరల్‌హౌస్‌కు వెళ్లే విమానాన్ని ఎక్కాడు. అదీ కూడా ఏ టిక్కెట్ లేకుండానే.. అదెలా సాధ్యమైందంటే.. టిక్కెట్ లేకుండా విమానంలో ప్రయాణించటం ఎలా? ఎవరికీ చిక్కకుండా విమానం ఎక్కటం ఎలా? అని పలు రకాలుగా గూగుల్‌లో సెర్చ్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత వాటిని ఫాలో అయ్యి విమానంలోకి అడుగుపెట్టాడు.
అలా దాదాపు 2700 కిలో మీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానానికి చేరుకున్నాడు. అక్కడ దిగిన తర్వాత తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అవి చూసిన తల్లిదండ్రులు కుమారుడు క్షేమంగా ఉన్నాడని ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఎయిర్ పోర్టు పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. టిక్కెట్ లేకుండా విమానం ఎలా ఎక్కాడు అన్నదానిపై విచారణ చేపట్టారు. ఆ పిల్లాడు సావోపాలోలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లాలనే ఉద్ధేశ్యంతో విమానం ఎక్కినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.