టాలెంట్ అనేది ఎవరి ఒక్కరి సొత్తు కాదు. ప్రతి ఒక్కరిలోను ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. టాలెంట్ లేని వ్యక్తులు ఉండరు. అయితే, దాన్ని గుర్తించి బయటకు తీయగలిగినపుడే ఆ టాలెంట్ బయటపడుతుంది. పేరు ప్రతిష్టలు వస్తాయి. టాలెంట్ నిరూపించుకోవడానికి వయసు ఊరు అని ఏమి ఉండదు. అయితే ఒక్కసారి వెలుగులోకి వస్తే మాత్రం ఇక వాళ్ల పేరు మారుమోగిపోతుంది. తాజాగా ఓ బుడ్డోడు చేసిన డ్యాన్స్ నెటిజన్లు ఆకట్టుకుంటుంది. ఎక్కడ ఏమిటనే వివరాలు తెలియదు కానీ ఓ గణేష్ ఊరేగింపు వేడుకల్లో ఈ బుడ్డోడు..తనదైన డ్యాన్స్ తో దుమ్ములేపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇళయ దళపతి విజయ నటించిన బీస్ట్ సినిమాలోని ‘మలమ పిత పిత’ అనే సాంగ్ కి ఈ చిన్నోడు డ్సాన్స్ చేశాడు. విజయ్ ను మించి అదిరపోయే స్టెప్పులేశాడు ఈ బుడ్డోడు. అక్కడి జనం ఈ బాలుడి డ్యాన్స్ కి ఫిదా అయ్యారు. అతడికి డబ్బులు ఇస్తూ మరింత ఉత్సాహపరిచారు. గణేష్ ఊరేగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ పిల్లవాడు డ్యాన్స్ చేశాడు. ఆ ఒరిజనల్ పాటకు కొరియోగ్రాఫ్ చేసిన డాన్స్ మాస్టర్ చూస్తే కుల్లుకునేంతలా ఆ బుడతడు డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం సౌత్ ఇండియాను ఈ డ్యాన్స్ ఓ ఊపు ఊపేస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఆ పిల్లాడికి నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. కొందరైతే.. ఈ పిల్లాడి ముందు విజయ్ కూడ సరిపోడు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి..ఈ వీడియోపై మీరు ఓ లుక్కేసి…మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.