Viral Video: ఈ సృష్టిలో తెలివైన జంతువుగా మానవుడు ఎదిగిన నాటినుంచి మానవుడు బాగుపడ్డాడే కానీ, మిగిలిన జంతువులకు పెద్దగా లాభం కలిగింది లేదు. మనిషి తన తెలివి తేటలతో బలమైన జంతువుల్ని కూడా ఇట్టే లొంగదీసుకున్నాడు. నచ్చితే పెంచుకుంటున్నాడు.. లేదంటి చంపి తినేస్తున్నాడు. కొన్ని జంతువుల విషయంలో మరీ దారుణంగా వ్యవహరిస్తున్నాడు. తన అవసరాలు తీర్చుకుంటున్నాడే తప్ప.. తన కంటే చిన్న ప్రాణుల గురించి కొంచెం కూడా ఆలోచించటం లేదు.. వాటిపై జాలి చూపడంలేదు.
ఇందుకు, తాజాగా జరిగిన ఓ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ చెట్టును కూల్చటంతో దానిపై నివాసం ఉంటున్న దాదాపు వంద పక్షులు తమ ఇంటిని కోల్పోగా.. మరికొన్ని మృత్యువాతపడ్డాయి. ఈ సంఘటన కేరళలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే… కేరళలోని మలప్పరంలో రోడ్డు పక్కన ఓ చెట్టు ఉంది. ఆ చెట్టు మీద దాదాపు వంద దాకా పక్షులు గూళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నాయి. తినడానికి తిండి ఉన్నా లేకపోయినా.. కొంచెం అన్నం పెట్టండి అని మనిషిని మాత్రం అడగలేదవి.
తిన్న కాడికి గుట్టుగా కాలం వెళ్లదీసాయి. అదే చెట్టుపై పుట్టిన పిల్లలు పెద్దవయ్యాయి. మరో బిడ్డకు జన్మనిచ్చాయి. అదే చెట్టుపై పిల్లాపాపలతో సంతోషంగా గడిపాయి. అయితే, మనిషి మాత్రం రోడ్డు వైడెనింగ్ పేరుతో చెట్టుపై దృష్టిసారించాడు. వాటి గురించి కొంచెమైనా ఆలోచించలేదు. ప్రొక్లయిన్‌తో చెట్టును కూల్చేశాడు. చెట్టుపై ఉన్న కొన్ని పక్షులు భయంతో పైకి లేచివెళ్లిపోయాయి. మరికొన్ని తేరుకునే లోపే ప్రాణాలు విడిచాయి. ఎగరటం తెలియని పిల్లలు కూడా ప్రాణాలు విడిచాయి. ప్రస్తుతం ఇందుకు సంబధించిన వీడియో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Everybody need a house. How cruel we can become. Unknown location. pic.twitter.com/vV1dpM1xij
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 2, 2022