దేశంలో అనేక చోట్ల రైల్వే క్రాసింగ్ గేట్లు ఉన్నాయి. రైలు వచ్చే సమయంలో పట్టాలు దాటే ఇతర వాహనాలను, మనుషులను నిలిపేందుకు వీటిని ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది ప్రజలు నిర్లక్ష్యంగా రైల్వే గేటు పడిన సమయంలో కూడా పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈక్రమంలో రైలు ఢీ కొని మరణిస్తుంటారు. మరి కొందరు తీవ్రగాయలయ్యయి ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నా.. కొందరిలో మార్పు రావడటం లేదు. అదే నిర్లక్ష్యంతో రైలు వస్తున్న సమయంలో పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనలో ఓ వ్యక్తి రెప్పపాటు కాలంలో బ్రతికిపోయాడు. కానీ అతడి బైక్ మాత్రం తునాతునకలైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తర్ ప్రదేశ్ లోని ఇటావాలోని ఓ ప్రాంతంలో కొందరు రైల్వే గేటు దాటుతున్నారు. రైలు వస్తున్న నేపథ్యంలో రైల్వే గార్డు గేటు వేశాడు. అయినా చాలా మంది పట్టాలు దాటుతున్నారు. అప్పటికే అక్క ఓ ట్రాక్ పై ఒక రైలు నెమ్మదిగా వెళ్తుంది. వారిలో కొంత మంది బైకర్లు కూడా ఉన్నారు. ఆ రైలు వెళ్లిపోగానే గేటు దాటి త్వరగా వెళ్లిపోదామని అనుకున్నారేమో! కానీ, ఇంతలో వారున్న ట్రాక్ మీద నుంచి మరో రైలు వేగంగా దూసుకొచ్చింది. అయితే రైలు రాకను గమనించి, ట్రాక్ మీద ఉన్న వారంతా వెనక్కి వచ్చేశారు. అయితే ఓ వ్యక్తి బైక్ వెనక్కి తిప్పే క్రమంలో పట్టాలపై పడిపోయాడు. ఈక్రమంలో బైక్ ని లాగే ప్రయత్నం చేశాడు.
అయితే ఆ బైక్ పట్టాల మధ్యన ఇరుక్కుపోయింది. ఈ క్రమంలో వ్యక్తి సమీపంలో కి రైలు వచ్చేసింది. బైక్ పోతే పోయింది ప్రాణాలు పోతాయి అనుకున్నాడేమో.. వెంటనే అక్కడి నుంచి పక్కకు వచ్చేశాడు. దీంతో క్షణాల్లో దూసుకొచ్చిన రైలు.. బైక్‌ను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. ఆ రైలు వేగం ధాటికి బైక్ ముక్కలు ముక్కలైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సదరు బైకర్ పై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
WATCH – Commuter’s bike gets stuck on railway crossing track in Etawah, blown to pieces by passing train. #ViralVideo pic.twitter.com/WQ3O8NXIxV
— TIMES NOW (@TimesNow) August 29, 2022