యూట్యూబ్ లో మంచి ఫేమ్ సొంతం చేసుకున్న యూట్యూబర్స్ కి బిగ్ బాస్ అనేది మంచి ప్లాట్ ఫామ్ అనే చెప్పాలి. ఎందుకంటే.. యూట్యూబ్ వరకే తెలిసిన వీరి ముఖాలు.. రియాలిటీ షో బిగ్ బాస్ పుణ్యమా అని టీవీ ప్రేక్షకులు గుర్తుపట్టే స్థాయికి చేరుకుంటున్నారు. ఆ విధంగా యూట్యూబ్ ద్వారా పరిచయమైన మెహబూబ్ దిల్ సే.. బిగ్ బాస్ కారణంగా తెలుగు రాష్ట్రాలలో మంచి ఫేమ్ దక్కించుకున్నాడు.
బిగ్ బాస్ అనంతరం మెహబూబ్ యూట్యూబ్ వేదికగా.. మ్యూజిక్ వీడియోస్, వెబ్ సిరీస్ లతో బిజీ అయిపోయాడు. ఈ మధ్య సినిమాల్లో ఛాన్సెస్ కూడా వచ్చినట్లు టాక్. ఇదిలా ఉండగా.. యూట్యూబ్ లో మ్యూజిక్ వీడియోస్ చేసే టైంలో కో-డాన్సర్స్ పై మనసు పారేసుకోవడం మాములు విషయమే. కానీ పారేసుకున్న మనసును ప్రేమతో గెలవడం చాలా కష్టం. తాజాగా మెహబూబ్ ఓ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. “ఎప్పటి నుంచో చెబ్దాం అనుకున్నా. కానీ ఎప్పుడు ఎలా అయ్యిందో తెలియదు. ఎందుకు ఇష్టం అన్నదానికి ఆన్సర్ తెలియదు. నువ్వు నా తోడుంటే బెటర్, సక్సెస్‌ఫుల్ పర్సన్‌ని అవుతా. నాతో జీవితాంతం తోడుంటావా” అంటూ తన మనసులో మాట బయట పెట్టాడు. దీంతో ఆ అమ్మాయి సైతం సిగ్గుపడుతూ మెహబూబ్ ప్రేమను అంగీకరించింది.ఇంతకీ ఎవరా అమ్మాయి? అంటే.. యూట్యూబర్ – టిక్ టాకర్ శ్వేతా నాయుడు. ఈమె కొన్నేళ్లుగా మెహబూబ్ తో యూట్యూబ్ సాంగ్స్, ఇంస్టా రీల్స్, టిక్ టాక్ వీడియోస్ చేస్తూ వచ్చింది. మరి ఇద్దరూ క్లోజ్ కాబట్టి ఎప్పటినుండి ఇష్టంలో ఉన్నారో తెలియదు. కానీ తాజాగా మెహబూబ్ ఇంస్టాలో.. వీరి లవ్ ప్రపోజల్ వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయితే అవుతోంది. కానీ ఇంతకీ వీరి ప్రపోజల్ నిజామా కాదా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజమే అయితే మెహబూబ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని టాక్ నడుస్తుంది. మరి మెహబూబ్ లవ్ ట్రాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.