ఐఫోన్ అంటే ఎవరికి పిచ్చి ఉండదు చెప్పండి. అయితే దానిని కొనేందుకు చాలా మంది ప్రత్నాలు, కృషి చేస్తారు. కొందరు మాత్రం ఆ అది మన రేంజ్ కాదులే అని ఊరుకుంటారు. కానీ, ఒక 7వ తరగతి విద్యార్థిని మాత్రం తాను కోరుకున్న ఐఫోన్ 14ని దక్కించుకుంది. అందుక ఆమె చేసిన పని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఐఫోన్ కొనుగోలు చేయాలి అనేది దాదాపుగా చాలా మందికి కలగా ఉంటుంది. ఆ ఫోన్ కొనాలి అంటే అంత తేలికకాదు. అందుకే చాలా మంది మధ్యతరగతి వాళ్లు ఆ ఫోన్ కొనడాన్నే లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకోసం చాలానే కష్టపడుతుంటారు. కానీ, ఆ ఫోన్ కొనగలరు అని నమ్మకంగా చెప్పలేం. ఆలాంటి ఒక గోల్ ని ఒక స్కూల్ విద్యార్థిని సెట్ చేసుకుంది. ఇంట్లో వాళ్లతో సంబంధం లేకుండా తనకు నచ్చిన ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకుంది. అందుకని ఆమె చేసిందో తెలుసుకుని అందరూ షాకవుతున్నారు. ఎందుకంటే అంత చిన్న వయసులో ఆమెకు అలాంటి ఆలోచన ఎలా వచ్చిందా? అని ముక్కున వేలేసుకుంటున్నారు.
బియాంకా జెమి వారియావా అనే ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినికి ఐఫోన్ అంటే పిచ్చి. తండ్రి జెమిభాయ్ వారియాది ఇండియా కాగా.. తల్లిది ఫిలిప్పీన్స్. వీళ్ల కుటుంబంలో దుబాయ్ సెటిల్ అయ్యింది. అమ్మానాన్న ఇద్దరూ ఫైవ్ స్టార్ హోటల్ లో షెఫ్స్ గా పనిచేస్తున్నారు. ఇద్దరూ చేయి తిరిగిన వంటవాళ్లే కావడంతో బియాంకాకి కూడా చిన్నప్పటి నుంచే వంట చేయడం బాగావచ్చు. ఆమెకు ఐఫోన్ అంటే పిచ్చి అనే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాలి అనుకుంది. కానీ, వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కాబట్టి.. కచ్చితంగా నో అంటారని తెలుసు. కొనివ్వక పోగా తిట్లు కూడా పడతాయని ఆమెకు బాగా తెలుసు.
అందుకే తల్లిదండ్రులకు చెప్పకుండానే తాను ఐఫోన్ 14 కొనాలి అనుకుంది. అందుకు ఏం చేయాలా? అని ఆలోచన చేస్తూ ఉంది. కానీ, ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. కానీ, ఓరోజు అద్భుతమైన ఐడియా తట్టింది. ఆమెకు బాక్స్ లో ఇంట్లోనే తయారు చేసిన మంచి బ్రెడ్స్ ని తల్లి పంపుతూ ఉంటుంది. ఆ బ్రెడ్స్ అంటే ఆమె ఫ్రెండ్స్ కి కూడా బాగా ఇష్టం. అందుకే ఆ ఇష్టాన్ని తాను మార్కెట్ చేసుకోవాలి అనుకుంది. తానే స్వయంగా ఆ బ్రెడ్స్ తయారు చేయడం నేర్చుకుంది. అంతేకాకుండా వాటిలో కొన్ని ఫ్లేవర్స్ ని కూడా తయారు చేసింది. అలా తయారు చేసిన బ్రెడ్స్ ని స్కూల్ అమ్మేందుకు నిర్ణయించుకుంది.
ఆ విషయాన్ని తన ఫ్రెండ్స్ కి చెప్పింది. 4 బ్రెడ్స్ వచ్చి 4 దిర్హామ్స్ గా ధర నిర్ణయించింది. మొదటి రెండ్రోజులు తనకు పెద్దగా ఆర్డర్స్ రాలేదు. కేవలం ఒకరు ఇద్దరు మాత్రమే ఆ బ్రెడ్స్ ని కొనుగోలు చేశారు. కానీ, తర్వాత ఆర్డర్స్ బాగా వచ్చాయి. రోజుకు 60 బ్రెడ్స్ వరకు విక్రయించింది. దాంతో ఆమెకు కావాల్సిన 3 వేల దిర్హామ్స్(రూ.68 వేలు) కేవలం 40 రోజుల్లోనే సంపాదించింది. వెంటనే ఆన్ లైన్ లో ఐఫోన్ 14 ఆర్డర్ చేసింది. ఆ ఫోన్ డెలివరీ కూడా అయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో బియాంకా గురించే చర్చ. ఆమె అనుకున్న లక్ష్యాన్ని ఎంతో తెలివిగా, చాలా త్వరగా చేరుకుందని ప్రశంసిస్తున్నారు.