ఓ సినిమాలో బిచ్చగాడు అందరిని చిల్లర అడుగుతుంటాడు. కానీ.., ఓ వ్యక్తి తనను అడక్క ముందే లేవు పో.. అంటూ హేళనగా చూస్తాడు. దీంతో.. ఆ బిచ్చగాడికి కోపం వచ్చి.. వారి సంఘం వారితో ఆ వ్యక్తి వెంటపడి అష్టకష్టాలు పెడతాడు. ఆ వ్యక్తికి చుక్కలు చూపిస్తాడు ఆబిచ్చగాడు. తాజా ఈ విధంగానే మధ్యప్రదేశ్ లోని ఓ రైల్వే స్టేషన్ లో భిక్షాటనం చేసే ఓ వ్యక్తికి కోపం వచ్చింది. కానీ.. అతను కొంచె వెరైటీగా ప్రవర్తించాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ లోని ఓ రైల్వే స్టేషన్ లో చిల్లర అడుకుంటున్న ఓ బిచ్చగాడిని ఎవరో.. ఏదో అన్నట్లున్నారు. ఇంక అంతే కొంపతో ఊగిపోయిన ఆ బిచ్చగాడు.. “ఏమి నీ దగ్గరేనా డబ్బులు ఉంది.. నా దగ్గర లేవా”? అంటూ.. తన సంచిని విదిలించాడు. అంతే ఆ సంచిలో నుండి ఒక్కసారిగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. కేవలం నోట్ల కట్టలు మాత్రమే కాదు, ఆ బిచ్చగాడి సంచిలో నుండి ఆస్తి పత్రాలను సైతం బయటపడ్డాయి.
ఇది కూడా చదవండి: ఇంట్లో ప్రియుడితో భార్య సరసాలు.. భర్త రాడనుకుని ఏకంగా!
బిచ్చగాడు కురిపించిన ఆ నోట్ల వర్షానికి స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. కానీ.., వారిలో ఒక్కరు కూడా ఆ డబ్బుని ముట్టుకోలేదు. కొందరు ఈ మొత్తం దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఈ శ్రీమంతుడైన బిచ్చగాడి మ్యాటర్ బయట ప్రపంచానికి తెలిసింది. ఇక ఈ బిచ్చగాడి దగ్గర ఉన్న డబ్బుని చూసి.. కొందరు మా కంటే నువ్వే ధనవంతుడివయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఓ సాధారణ బిచ్చగాడి దగ్గర ఇంత డబ్బు, ఆస్తి ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.