మానవత్వం కనుమరగు అవుతున్న పరిస్థితులు ప్రస్తుతం మన సమాజంలో నెలకొన్నాయి. ఉరుకులపరుగుల జీవితం మనల్ని నడిపిస్తోంది. ఓ నిమిషం ఆగి మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే తీరకి మనకు లేకుండా పోతుంది. మన గురించి మనకు ఆలోచించుకునే తీరిక లేని వేళ.. సమాజం గురించి ఏం ఆలోచిస్తాం. ఎదుటు మనిషికి సాయం చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం. మనకు వచ్చే లాభం ఏంటని బేరీజు వేసుకుని ఆ తర్వాత స్పందిస్తాం. అయితే లోకంలో అందరు ఇలానే ఉంటే.. ఈపాటికి భూమి అంతమయ్యేది. కానీ అక్కడక్కడ కొందరు మానవత్వం మూర్తీభవించిన మనుషులు ఉంటారు. వారికి ప్రపంచమే ఇల్లు. ప్రతి ఒక్కరు తన కుటుంబ సభ్యుడే. జగమంత కుటుంబం వారి సిద్ధాంతం. అనంతమైన ప్రేమను పంచుతూ.. మానవత్వం చాటుకుంటూ ముందుకు సాగుతారు. సమాజం నుంచి వారు ఏమి కోరుకోరు. ఇదిగో ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఓ వ్యక్తి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అతడి మంచి మనసుపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆ వివరాలు..
సాధారణంగా రోడ్డు పక్కన మతి స్థిమితం కోల్పోయి పిచ్చిగా తిరిగే అనామకులు ఎందరో మనకు తారసపడుతుంటారు. ఒంటిమీద సరైన బట్టలు ఉండవు. స్నానం, పానం లేక.. ఒళ్లంత మట్టి కోట్టుకుపోయి.. చూడగానే అసహ్యం కలిగించే విధంగా ఉంటారు. అలాంటి వారిని చూసినప్పుడు చాలా మంది అసహ్యంతో ముఖం తిప్పుకుంటారు. ఇక కొందరు అయ్యో పాపం అనుకుంటారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే అలాంటి వారిని ప్రేమగా అక్కున చేర్చుకుని.. వారికి ఓ జీవితాన్ని ప్రసాదిస్తారు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి అదే పని చేసి అందరి ప్రశంసలు పొందాడు. రోడ్డు మీద బిచ్చగాడిగా తిరుగుతున్న యువకుడిని పూర్తిగా మార్చేశాడు. అద్దంలో తనను తాను చూసుకున్న ఆ అనామకుడు.. నమ్మలేక కంటనీరు పెట్టుకున్నాడు. ఎందుకంటే బాలీవుడ్ హీరోలుగా ధీటుగా.. అంత అందంగా ఉన్నాడు కాబట్టి.
ఇటీవల ఫేస్‌బుక్ పేజీ లైట్ వర్కర్స్‌లో ఇందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశారు. ఇది చాలా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో…. ఒక బార్బర్ నిరాశ్రయుడు అయిన ఓ బెగ్గర్‌ని తన సెలూన్‌కి తీసుకువచ్చి అతడికి మేకోవర్ చేసే బాధ్యతను తీసుకుంటాడు. ఆ వ్యక్తి జుట్టు, గడ్డం కట్ చేస్తాడు. జుట్టు చిన్నదైన తర్వాత ఆ బెగ్గర్ ముఖం పూర్తిగా మారిపోతుంది. అతని లుక్ మారి చాలా స్మార్ట్ గా కనిపిస్తాడు. అంతటితో ఊరుకోక సదరు బార్బర్.. ఆ బిచ్చగాడి ఒంటిని శుభ్రం చేస్తాడు. దీని తర్వాత అతను ధరించడానికి కొత్త బట్టలు ఇస్తాడు. శరీరం శుభ్రం అయ్యి.. కొత్త బట్టలు ధరించిన బిచ్చగాడు మోడల్‌గా కనిపించడం ప్రారంభించాడు. అద్దంలో తనను తాను చూసి కళ్లలో నీళ్లు తిరుగుతూ కొత్త బట్టలతో ఎమోషనల్ గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ బెగ్గర్.
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్,వేల కామెంట్స్ వచ్చాయి. చాలా మంది ఈ వీడియో ఫేక్ అని కామెంట్ చేస్తున్నారు. ఇదొక ప్లాన్డ్ వీడియో అని,అతడు బెగ్గర్ కాదు ఓ నటుడని అంటున్నారు. అయితే మరికొందరు ఆ బార్బర్ ని మెచ్చుకుంటున్నారు. ప్రతిఫలంగా ఏమీ ఇవ్వలేని వారికి సహాయం చేయడం పెద్ద విషయం అంటూ బార్బర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలయజేయండి.