Viral Video: కొంతమందికి తాము సెలెబ్రిటీలు అయిపోవాలన్న పిచ్చి బాగా ఎక్కిపోయింది. సినిమాలు, సీరియళ్లతో ఫేమ్ తెచ్చుకోవటం అంత సులభం కాదు కాబట్టి.. సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. ఓవర్ నైట్ స్టార్ అయిపోవటానికి ఏదైనా చేయటానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ బడితే అక్కడ డ్యాన్స్‌లు చేసేస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా, ఓ యువతి నడి రోడ్డుపై డ్యాన్స్ చేసిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ అమ్మాయి చేసింది డ్యాన్సే కదా.. అందులో వింత, విశేషం ఏముంది అనుకుంటున్నారా?..
ఆ వీడియోలో విశేషం ఉంది. రోడ్డుపై ఆమె ఒక్కత్తే డ్యాన్స్ చేయలేదు. ఆమె వెనకాల ఓ ఆటో డ్రైవర్ కూడా డ్యాన్స్ చేశాడు. ఆ యువతి ఓ మార్కెట్‌లోని రోడ్డుపై హిందీ ఐటమ్ సాంగ్ ‘‘దిల్‌బర’’కు డ్యాన్స్ చేస్తూ ఉంది. ఆమె వెనకాల ఖాకీ డ్రెస్‌లో ఉన్న ఓ ఆటో డ్రైవర్ కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. యువతిని అనుకరిస్తూ తన స్టైల్లో స్టెప్పులు వేశాడు. అచ్చు గుద్దినట్లు ఆమెలా స్టెప్పులు వేయటానికి ప్రయత్నించాడు. కానీ, కుదరలేదు. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌కు సంబంధించిన 17 సెకన్ల వీడియో ట్విటర్‌లో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియో ఇప్పటికే దాదాపు 2 లక్షలకు పైగా వ్యూస్, 5.5 వేల లైక్స్ తెచ్చుకుంది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను చూసి పగలబడి నవ్వుతున్నారు. ఆటో డ్రైవర్ డ్యాన్స్‌ను ప్రముఖంగా పొగుడ్తున్నారు. ‘‘ నేను గనుక వీడియో తీస్తున్నపుడు పక్కన ఉండి ఉంటే నవ్వి, నవ్వి చచ్చేదాన్ని’’.. ‘‘వీడియోలో నీ డ్యాన్స్ అదిరింది బ్రో’’.. ‘‘ ఆ ఆటో డ్రైవర్‌కు కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్’’.. ‘‘ ఇలాంటి వన్నీ ఎక్కడినుంచి వెతుక్కుని తెస్తారు రా’’.. ‘‘ అతడ్ని డ్యాన్సింగ్ షోకు పంపించాలి’’.. ‘‘ అతడు డ్యాన్సింగ్ ఆణిముత్యం’’ అని కామెంట్లు చేస్తున్నారు.
अच्छा है आजकल रोड साइड लोगों को कंपनी मिल जाती है pic.twitter.com/PoLcw8U5Vs
— 24 (@Chilled_Yogi) October 6, 2022